డైరెక్టర్ ముప్పలనేని శివ దర్శకత్వం లో, సూపర్ గుడ్ మూవీస్ నిర్మించిన ” సంక్రాంతి” సినిమా లోని ” డోలీ డోలీ డోలిరే” అనే పాట షూటింగ్ మద్రాస్ సముద్ర తీరంలో చేయాలి అనుకున్నారు. ఆ పాటలో దాదాపుగా సినిమాలోని నటీనటులందరూ పాల్గొనవలసి ఉంది.ముప్పలనేని శివ మాత్రం ఆ పాటకు సముద్ర తీరం లొకేషన్ సరికాదని, హైదరాబాద్ లోని ఇక్రిశాట్ లోని లేక్ వద్ద చేయాలి అనుకున్నారు, వాకాడ అప్పా రావు గారు, హైదరాబాద్ లో అయితే చాల ఖర్చు అవుతుంది మద్రాస్ లో అయితే ఖర్చు తక్కువ అవుతుంది అన్నారట. చేసేది ఏమిలేక శివ ఒకే చేసారు. తీరా షూటింగ్ కి రెండు రోజుల ముందు డైరెక్టర్ శివ కు ఫోన్ చేసి మీరు అనుకున్న లొకేషన్ లోనే సాంగ్ షూటింగ్ పెట్టుకోండి అన్నారట.
అది డిసెంబర్ 26 , 2004 అనుకొన్న ప్రకారం ఇక్రిశాట్ లేక్ దగ్గర షూటింగ్ చేస్తున్నారు, హీరో వెంకటేష్, శ్రీకాంత్, శివ బాలాజీ, శర్వానంద్, స్నేహ, ఆర్తి అగర్వాల్, శారద, చంద్ర మోహన్, సుధాకర్ ఇలా సినిమాలోని కాస్టింగ్ అంత ఆ పాటలో నటిస్తున్నారు. ఇంతలో ముప్పలనేని శివ కు చెన్నై నుంచి ఒక ఫోన్ వచ్చింది, అవతలి వ్యక్తి చెప్పిన విషయం వినగానే శివ కాళ్ళ క్రింద భూమి కుంగిపోయినట్లు అయింది. ఆ విషయం ఏమిటో తెలుసా,సునామి వచ్చి కన్యాకుమారి నుంచి మద్రాస్ బీచ్ వరకు సముద్రం ముందుకు వచ్చి కొన్ని వేలమంది చనిపోయారని. అదే మొదట అనుకున్నట్లు ఈ పాట షూటింగ్ అక్కడ పెట్టుకొని ఉంటె ఇందులో పాల్గొంటున్న ఒక్కరు కూడా మిగిలి ఉండే వారు కారు. ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో చూడండి, తెలుగు సినీ చరిత్రలో అత్యంత విషాదకరమయిన రోజు గ డిసెంబర్ 26 , 2004 మిగిలిపోయేది. ఆలా తృటిలో ప్రమాదం నుంచి బయట పడ్డారు సంక్రాంతి సినిమాలోని ఆరిస్టులు. టెక్నిషన్లు.