
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]సి[/qodef_dropcaps]నిమా టికెట్లు, థియేటర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. అన్‌లైన్‌లో సినిమా టికెట్ల అమ్మకాలను ప్రభుత్వం త్వరలో రద్దు చేసే యోచనలో ఉందని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ప్రభుత్వమే అధికారికంగా సినిమా టికెట్ల అమ్మకాలు నిర్వహించే ఆలోచనలో ఉందని ఇందుకోసం ప్రణాళికలు రచిస్తోందని చెప్పారు. ఈ నిర్ణయం ద్వారా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు లాభపడతారని మంత్రి వివరించారు.