మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా ఆయన కుమార్తె సుష్మితా కొణిదెల ఓ సినిమా నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’, ‘బంగార్రాజు’ చిత్రాల ఫేమ్ కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించనున్నారు. ఆల్రెడీ కథ, కథనాలు లాక్ చేసేశారట. ఇందులో చిరు జోడీగా త్రిష పేరు పరిశీలనలో ఉంది. ఆమె ఎంపిక దాదాపు ఖాయమైనట్టే. ఇంతకు ముందు ‘స్టాలిన్’ సినిమాలో చిరంజీవి, త్రిష జంటగా నటించారు. వాళ్ళ జోడీ మీద అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ఈ సినిమాతో హిట్ అందుకోవాలని ఆశిద్దాం! సుమారు 17 ఏళ్ళ తర్వాత చిరు, త్రిష జోడీ కుదిరింది..!!