in

Trisha Krishnan Planning To Quit Cinema And Enter Politics?

త్రిష సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే త్రిష సినిమాలకు గుడ్‌ బై చెప్పనుందని గత కొన్ని రోజులుగా వార్తలు తెగ వైరల్‌ అవుతున్నాయి. సినిమాలకు ఫుల్‌‌స్టాప్‌ పెట్టాలనే ఆలోచనలో ఉన్న త్రిష పొలిటికల్ పార్టీలో చేరాలని ఆలోచిస్తోందని సమాచారం. విజయ్‌ పెట్టిన పార్టీలో త్రిష చేరే అవకాశాలు ఉన్నాయని నెట్టింట పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే దీనిపై త్రిష ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు..

కానీ సోషల్‌ మీడియాతో పాటు కోలీవుడ్‌ మీడియాలో మాత్రం ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే కొందరు మాత్రం ఈ వార్తలు కొట్టి పారేస్తున్నారు. త్రిష సినిమాలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టబోదంటూ స్పందిస్తున్నారు. ఒకవేళ పార్టీలో చేరినా సినిమాలకు కొనసాగిస్తుందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే..!!

f cube ‘tollywood 2’!

beauty nidhi agarwal playing a DE glamour role in ‘raja saab’!