సినిమాల్లో ఒకప్పుడు స్పెషల్ సాంగ్స్‌లో హీరోయిన్స్ పెద్దగా నటించడానికి ఆసక్తి చూపించే వారు. స్పెషల్స్ సాంగ్స్ కోసం ఇతర భాషలకు చెందిన కొందరు నటీమణులను మేకర్స్ తీసుకునే వారు. అయితే ఆ తర్వాత హీరోయిన్స్ నటిండచం ఒక ట్రెండ్‌గా మారింది. కేవలం సీనియర్ నాయికలు మాత్రమే కాకుండా కెరీర్ తొలి నాళ్లలోనే స్పెషల్ సాంగ్స్‌లో నటించిన వారు ఎంతో మంది ఉన్నారు.
వీరి జాబితాలోకి అనుష్క, పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్, సమంత, ఎంతో మంది ఉన్నారు. అయితే అందాల తార త్రిష మాత్రం ఇప్పటి వరకు స్పెషల్ సాంగ్‌లో కనిపించింది లేదు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పాతికేళ్లు గడుస్తోన్నా ఇప్పటికీ త్రిష స్పెషల్ సాంగ్‌లో నటిచంలేదు. అయితే తాజాగా త్రిష ఓ స్పెషల్ సాంగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తన కెరీర్‌లోనే తొలిసారి స్పెషల్ సాంగ్‌లో కనిపించనుందని వార్తలు వస్తున్నాయి..!!