త్రిష, శింబు పెళ్లి వార్త మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఈ వైరల్ అవుతున్న ఫొటో ఎప్పటిది, ఏ సందర్భంలోనిది అనే స్పష్టత లేదు. శింబు, త్రిష మధ్య మంచి స్నేహం ఉందని కోలీవుడ్ వర్గాల్లో ఎప్పటినుంచో వినిపిస్తున్న మాట. వీరిద్దరూ కలిసి గతంలో ‘అలై’, ‘విన్నైతాండి వరువాయా’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు. లాక్‌డౌన్ సమయంలో ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ రూపొందించిన ‘కార్తీక్ డయల్ సైత ఎన్’ అనే షార్ట్ ఫిలింలో కూడా వీరిద్దరూ కలిసి కనిపించి ఆకట్టుకున్నారు..
అప్పటి నుంచి వీరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగిందని చెప్పుకుంటున్నారు. గతంలో పలుమార్లు త్రిష పెళ్లి గురించి వార్తలు వచ్చినప్పటికీ, అవన్నీ కేవలం వదంతులుగానే మిగిలిపోయాయి. ఇప్పుడు శింబుతో వస్తున్న వార్తలపై కూడా ఆమె అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మరి ఈ తాజా ప్రచారంపై త్రిష కానీ, శింబు కానీ అధికారికంగా స్పందిస్తారేమో వేచి చూడాలి. అప్పటివరకు ఇవి కేవలం ఊహాగానాలుగానే పరిగణించాల్సి ఉంటుంది..!!