తమిళ స్టార్ హీరో సూర్య – వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది. ఇప్పటికే, ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించిన చిత్ర యూనిట్, ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఐతే, తాజాగా ఈ మూవీలో మరో హీరోయిన్ గా త్రిప్తి దిమ్రిని తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. త్రిప్తి లీడ్ హీరోయిన్ కాదని, సెకండ్ హీరోయిన్ అని టాక్ నడుస్తోంది. ఇంతకీ ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో చూడాలి..
కాగా ఈ సినిమాకు వెంకీ అట్లూరి ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ అనే ఆసక్తికర టైటిల్‌ను ఫిక్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో అందాల భామ మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. జి వి.ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలోనే ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు..!!