in

tripti dimri on board for nani – sujith’s bloody romeo?

OG ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో నాని ఒక స్టైలిష్ యాక్షన్ డ్రామాకు శ్రీకారం చుట్టాడు. ఈ చిత్రానికి ‘బ్లడీ రోమియో’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం సుజీత్ సినిమాటిక్ యూనివర్స్ (SCU)లో భాగంగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్ కోసం నాని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..

​ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ సెన్సేషన్ త్రిప్తి డిమ్రీని ఎంపిక చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా – ప్రభాస్ కాంబినేషన్‌లో వస్తున్న ‘స్పిరిట్’ సినిమాలో త్రిప్తి నటిస్తోంది. ఒకవేళ సుజీత్ ప్రాజెక్టులో కూడా ఆమె ఓకే అయితే, ఇది ఆమెకు రెండో తెలుగు సినిమా అవుతుంది. ‘యానిమల్’ చిత్రంతో నేషనల్ క్రష్‌గా మారిన త్రిప్తి, నాని సరసన నటిస్తే ఆ సినిమాకు మరింత క్రేజ్ రావడం ఖాయం..!!

Sai Pallavi, vijay Sethupathi mani ratnam combo on Cards?