కళా వాచస్పతి జగ్గయ్య, బహుముఖ ప్రజ్ఞ శాలి ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు, మంచి రచయిత, రవీంద్రనాథ్ టాగోర్ రచించిన “గీతాంజలి” ని తెలుగులోకి అనువదించిన ఉద్దండుడు, ట్రెండ్ సెట్ చేసిన రాజకీయ నాయకుడు కూడా, చట్ట సభలలో అడుగు పెట్టిన మొట్ట మొదటి నటుడు. రీల్ లైఫ్ లో, రియల్ లైఫ్ లో జరిగిన ఒక చిత్రమయిన సంఘటన ఏమిటంటే. నటుడిగా జగ్గయ్య గారు 1957 లో నటించిన ఏం.ఎల్.ఏ. చిత్రం లో ఆయన అసెంబ్లీ ఎల్లెక్షన్స్ లో “ఆవు దూడ” గుర్తు మీద పోటీ చేసి ఏం.ఎల్.ఏ. గ గెలుస్తారు. సరిగ్గా దశాబ్దం తరువాత అంటే 1967 లో నిజ జీవితం లో ఆ జగ్గయ్య గారు ఒంగోలు పార్లమెంట్ సీట్ కి ” ఆవు దూడ” అప్పటి( ఇందిరా కాంగ్రెస్ సింబల్) మీద పోటీ చేసి 80 000 మెజారిటీ తో గెలిచి పార్లమెంట్ లో అడుగు పెట్టారు..
యెన్.టి.ఆర్., ఏ.యెన్.ఆర్. సావిత్రి వంటి నటి నటులు అందరు ఆయన కోసం ఒంగోలు లో ప్రచారం చేసారు. భారతీయ చలన సచిత్ర పరిశ్రమ నుంచి పార్లమెంట్ లో అడుగు పెట్టిన మొట్ట మొదటి నటుడు కొంగర జగ్గయ్య గారు. నటుడిగా, వ్యక్తి గ, ఆయన ఎప్పుడు ట్రెండ్ సెట్టర్ గానే ఉన్నారు. బహుశా ఇప్పుడు ఉన్న నటులకు, రాజకీయ నాయకులకు కూడా జగ్గయ్య గారు 1967 లోనే పార్లమెంట్ ఎల్లెక్షన్స్ లో పోటీ చేసి గెలిచిన విషయం తెలిసి ఉండక పోవచ్చు. విజయం ఎప్పుడు మౌనంగా ఉంటుంది, అపజయమే ఆర్భాటం చేస్తుంది అందుకు చక్కటి ఉదాహరణ ఈ సంఘటన. మీడియా, బాకాలు ఊదే అభిమాన గణం, లేని కొంత మంది ప్రతిభావంతులు ఇలాగె చరిత్రలో మౌనంగా కలిసి పోతుంటారు, ఇది ప్రారంభం కాదు, అంతం అంత కంటే కాదు. ఇదొక విషవలయం అది అలా సాగి పోతూనే ఉంటుంది!!!