శ్రీ రంగం శ్రీనివాస రావు, శ్రీ శ్రీ, గ సాహితి ప్రియులకు సినిమా ప్రేక్షకులకు సుపరిచితులు. తన విప్లవ రచనలతో యువతను ఉర్రుతలూగించిన విప్లవ కవి, తన సినీ గేయాలతో తెలుగు సినీ సాహిత్యానికి జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొని వచ్చిన మేటి సినీ రచయిత.అటువంటి మేటి రచయిత పడ్డ ఒక సినిమా కష్టం గురించి చెప్పాలి. తెలుగు సినిమా పాటను జాతీయ ఉత్తమ సినీ గేయం గ ఎంపిక చేసారు, అదే శ్రీ శ్రీ గారి కలం నుంచి నిప్పులు చిమ్మిన ” తెలుగు వీర లేవరా దీక్షబూని సాగర ” అనే పాట. సదరు పాటను “అల్లూరి సీతారామరాజు ” సినిమా కోసం రాసారు, ఉత్తమ గేయ రచయిత పురస్కారాన్ని అందుకోవటానికి సతి సమేతం గ ఢిల్లీ వెళ్లారు, పోవటానికి సరిపడా డబ్బులతో ఢిల్లీ చేరుకున్నారు, అక్కడ పురస్కారం తో పాటు నగదు బహుమతి కూడా ఇస్తారు కాబట్టి తిరుగు ప్రయాణపు ఖర్చులకు ఆ డబ్బులు సరిపోతాయిలే అని ధీమాగా వెళ్లిన శ్రీ శ్రీ గారు..
వారి పురస్కారం తో పాటు, వారిచ్చిన కవర్ తెరిచి హతాసులు అయ్యారు. విషయం ఏమిటంటే అందులో నగదుకు బదులు సేవింగ్స్ బాండ్లు ఉన్నాయి. శ్రీ శ్రీ గారి జేబులో ఖాళీ గ ఉన్నాయి. ఇటువంటి కష్టాల్, నష్టాల్ ఎన్నో చూసిన శ్రీ శ్రీ గారు, కోపాల్, తాపాల్ లేకుండా ప్రశాంతంగా తొణకకుండా , “ఏది తనంత తానే నీ దరికి రాదు, శోధించి సాధించాలి” అనుకోని ఢిల్లీ లో ఉన్న స్నేహితుల చిట్టా బయటకు తీసి” ” ఢిల్లీకి చేరినాము దేహి దేహి అంటున్నాము బ్రదర్” అని వారి వద్ద అప్పు చేసి, రైలు టికెట్ కొని తిరుగు ప్రయాణం అయ్యారట. చూసారా ఈ శతాబ్దం నాది అంటూ గర్వంగా, ఒకింత పొగరుగా చాటుకున్న మహా కవికి ఎటువంటి కష్టం వచ్చిందో. దీనినే అంటారు సినీ మాయ, లేదా సినిమా కష్టం అని.