సినీ రంగం ఒక స్వర్గలోకం, అందులోని వారందరు దేవతలు, అనుకుంటారు అందరు కానీ అదొక మాయ లోకం అని చాల తక్కువ మందికి మాత్రమే తెలుసు. అనుకోకుండా ఈ మాయ లోకంలోకి నెట్టబడతారు కొందరు, కావాలని ఏరి, కోరి ఈ దృతరాష్ట్ర కౌగిలి కి వస్తారు మరి కొంత మంది.అడుగు పెట్టాక తమకు ఎదురులేదనుకుంటారు, కొందరు స్వయంకృత అపరాధము తో తెర మరుగు అయితే, మరికొందరు విధి ఆడే వింత నాటకం లో బలి అయిపోయి అనామకులుగా మిగిలిపోతారు. అనుకోకుండా ఈ మాయ లోకంలోకి నెట్టబడి, ఒక వెలుగు వెలిగి, విధి వంచిత అయి, అనామకంగా ఈ లోకాన్ని వీడారు నటి అశ్వని. అశ్వని చేసిన ఒకే ఒక తప్పిదం ఆమె పాలిట శాపం అయి ఆమెను కాటేసింది,. అశ్వని అసలు పేరు వాణి, సొంత ఊరు నెల్లూరు. ఇంటర్ పూర్తి చేసి మెడిసిన్ చేయాలనే ప్రయత్నం లో ఉన్న అశ్వని ఒక సారి, మద్రాసు లోని ఒక బట్టల షాప్ కి వెళ్లారు, అక్కడ నిర్మాత వాకాడ అప్పా రావు ఆమెను చూడటం, ఆమె అందానికి ముగ్ధుడు అయిన వాకాడ, ఆమెను కోడి రామ కృష్ణ కు పరిచయం చేసారు, అప్పటికే వారు నిర్మిస్తున్న చిత్రం లో అవకాశం ఇవ్వలేకపోయారు కోడి రామ కృష్ణ, అయినా కూడా ఆమెను , దర్శకుడు ధవళ సత్యం గారికి పరిచయం చేసారు,
ఆయనే ఆమె పేరును ఆమె జన్మ నక్షత్రమయిన అశ్వనిగా మార్చి,” గుడిగంటలు మోగాయి “అనే చిత్రం తో నటి అయ్యారు.డాక్టర్ కావాల్సిన వాణి యాక్టర్ అయ్యారు. హీరోయిన్ గ బిజీ అయ్యారు, దాదాపుగా తెలుగు హీరోలు అందరితో నటించటమే కాక సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింటిలో నటించారు, సుమారు 150 చిత్రాలలో నటించారు అశ్వని . రవీంద్ర నాథన్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఇక మామూలే, కొంత కాలానికి రాధా కృష్ణన్ ఆమెను వీడి పోవటం, ఆమె లంగ్ కాన్సర్ బారిన పడటం, ఆమె కు అవకాశాలు తగ్గటం తో, ఆస్తి మొత్తం హారతి కర్పూరం అయిపొయింది, తమిళ హీరో పార్థిపన్ ఆమెను ఆర్ధికంగా ఆదుకున్నారు, కానీ ఆమె కాన్సర్ ను ఎదిరించలేక కొంత కాలానికి మరణించటం జరిగి పోయాయి. పార్థిపన్ ఆమె భౌతిక కాయాన్ని తన ఖర్చులతో సొంత ఊరు అయిన నెల్లూరు కి పంపించటం జరిగింది.కన్న ఊరిలోనే కడతేరాలనే ఆమె చివరి కోరిక ను పార్థిపన్ తీర్చారు. సినీ వినీలాకాశంలో ఒక వెలుగు వెలిగిన అశ్వని జీవితం ఆలా 36 ఏళ్ళ వయసులోనే అనామకంగా, విషాదాంతం అయింది..!!