
విధి ఎవరిని విడిచిపెట్టదు దీనికి మంచి ఉదాహరణగా సిల్క్ స్మిత గారి జీవితం చెప్పుకోవచ్చు..సౌత్ ఇండియా లో ఒక వెలుగు వెలిగిన స్మిత గారు తన చివరిరోజులు ఎలా గడిపారో తెలుస్తే గుండె తరుక్కుపోతుంది..వయసు మీద పడి సినిమా ఆఫర్స్ తగ్గడంతో కష్టాల్లో ఉన్న సిల్క్ స్మితను ఆదుకోవటానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆఫర్స్ కూడా ఇవ్వలేదు. అప్పటి వరకు ఆహో..ఓహో అన్నోళ్లు కూడా ముఖం చాటేశారు. డబ్బు లేకపోవటంతో బంగ్లా నుంచి చిన్ని ఇంటికి మారింది. సొంత ఇల్లు అమ్మేసింది. మందుకి బానిస అయ్యింది. రోజువారీ ఖర్చు కోసం కూడా ఇబ్బంది పడింది. ఇదే విషయంలో ఆమె పోస్టుమార్టం రిపోర్ట్ లో వెల్లడి అయ్యింది. కడుపులో అరటిపండ్లు, చాక్లెట్లు తప్ప ఏమీ లేదని చెప్పారు డాక్టర్లు. అన్నం తిని చాలా రోజులు అయ్యిందని చెప్పారు. మూడు రోజులుగా ఆహారం తీసుకోలేదని చెప్పారు.

