ప్రముఖ యాంకర్ అండ్ నటి అనసూయ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది, అనసూయ తండ్రి సుదర్శన్ రావు ఈ రోజు ఉదయం మృతి చెందినట్లు తెలుస్తుంది. దీనితో అనసూయ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది, అనసూయ భరద్వాజ్. ఆమె తండ్రి సుదర్శన్ రావు తార్నాకలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. సుదర్శన్ రావు కొద్ది కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలిసింది.
సుదర్శన్ రావు చాలాకాలం పాటు కాంగ్రెస్ పార్టీ లో పని చేశారు. పలు ఇంటర్వ్యూలలో ఆయన తండ్రి చాలా స్ట్రిక్ట్ అని చెప్పేది అనసూయ. తండ్రి మృతితో అనసూయ కుటుంబం శోకంలో మునిగిపోయింది. ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులు అనసూయ కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నారు. తాము స్వతంత్రంగా, ధైర్యంగా ఉండాలని తండ్రి మరీ మరీ చెప్పేవారని తెలిపింది.
ఆటోవాళ్లతో ఎలా మాట్లాడుతున్నా?, వాళ్లను ఎలా హ్యాండిల్ చేస్తున్నాం? అనేది కూడా దూరం నుంచి ఆయన ఓ కంట కనిపెడుతుండేవారని అనసూయ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అయితే తెలుగు సినీ పరిశ్రమలో ఇటీవల వరుస విషాదాలు జరుగుతుండడం సినీ ప్రియులను కలవరపెడుతుంది. శివ శంకర్ మాస్టారు, సిరి వెన్నెల సీతారామ శాస్త్రి, కిరణ్ అబ్బవరం సోదరుడు, ఇప్పుడు అనసూయ తండ్రి. ఇలా వరుస విషాదాలతో అభిమానులు తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు.