1985లో విజయశాంతి మెయిన్ లీడ్‌లో టి. కృష్ణ దర్శకత్వంలో 1985 విడుదలైన చిత్రం ప్రతిఘటన..బాక్స్‌ఆఫీస్ వద్ద నాలుగు కోట్లకి పైగా షేర్ వసూళ్ళు చేసి సంచలన విజయం సాధించి ఆ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్‌గా నిలించింది ప్రతిఘటన… ఈ విజయం అప్పట్లో అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాతో విజయశాంతికి స్టార్ హీరోయిన్ ఇమేజ్‌తో పాటుగా నంది అవార్డు కూడా లభించింది. అదే సంవత్సరం సూపర్‌స్టార్ కృష్ణ హీరోగా వచ్చిన అగ్నిపర్వతం, వజ్రాయుధం, మెగాస్టార్ చిరంజీవి అడవిదొంగ చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇక 1997లో మరోసారి ఈ రేర్ ఫీట్‌ను అందుకున్నారు విజయశాంతి. దాసరి నారాయణరావు స్వీయదర్శకత్వంలో విజయశాంతి ప్రధానపాత్రలో ఒసేయ్ రాములమ్మ చిత్రం తెరకెక్కింది.
భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా అన్యాయానికి గురైన ఒక దళిత మహిళ చేసిన పోరాటమే ఈ చిత్రం. ఒక సాధారణ మహిళ నక్సలైట్‌గా ఎలా మారిందో తెరపైన అద్భుతంగా చూపించారు దాసరి.. విజయశాంతి అంతే అత్యద్భుతంగా నటించి ఆ పాత్రకి ప్రాణం పోశారు. కేవలం రెండు కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా 12.5 కోట్లను వసూలు చేసి ఆ సంవత్సరం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయితే ఇదే ఏడాది చిరంజీవి మాస్టర్, నాగార్జున అన్నమయ్య, వెంకటేష్ ప్రేమించుకుందాం రా, బాలకృష్ణ పెద్దన్నయ్య చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాలన్నింటిని క్రాస్ చేసి ఒసేయ్ రాములమ్మ ప్రభంజనం సృష్టించింది