10. RAJASHEKAR – GADDAM GANG – 2020

2020 లో వచ్చిన ‘గడ్డం గ్యాంగ్’ సినిమా తరువాత కొంత గ్యాప్ తర్వాత ఆయన మరో రీమేక్ లో నటిస్తున్నట్టు సమాచారం. రాజశేఖర్ ప్రస్తుతం ‘శేఖర్’ అనే మూవీలో నటిస్తున్నారు.ఇది ఆయనకు 91 వ చిత్రం కావడం విశేషం..మలయాళంలో సూపర్ హిట్టయిన ఓ క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ఆధారంగా ‘శేఖర్’ మూవీ రూపొందుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఓటిటి లో రాబోతుందని టాక్..
09. NIKHIL – ARJUN SURAVARAM – 2019

నిఖిల్ చివరి సినిమా ‘అర్జున్ సురవరం (2019)’ ప్రస్తుతం ఈ యంగ్ హీరో తన సూపర్ హిట్ సినిమా కార్తికేయ సీక్వెల్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది..అలాగే సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘18 పేజీస్’ సినిమాలో నిఖిల్ సిద్దార్థ్ నటిస్తున్నాడు. ఈ మూవీలో నిఖిల్ సరసన అనుపమ నటిస్తోంది..ఈ రెండు సినిమాలు ౨౦౨౨ లో రిలీస్ కాబోతున్నాయి..
08. VARUN TEJ – GADDALAKONDA GANESH – 2019

మెగా ఫ్యామిలీలో 2021లో సినిమా చేయని మరో హీరో వరుణ్‌తేజ్. 2019లో ‘గద్దలకొండ గణేష్’తో ఆఖరిగా వెండితెరపైకి వచ్చిన వరుణ్ అప్పటి నుండి ‘గని’ పనుల్లో ఉన్నాడు. అలాగే ‘ఎఫ్ 3’ కూడా చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమాలు తెరపైకి వస్తాయి. ‘గని’ ఈ ఏడాదే రావాల్సి ఉన్నా… వివిధ కారణాల రీత్యా వాయిదా వేశారు.
07. ADIVI SESH – EVARU – 2019

క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు(2019)’ వంటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలతో విజయాలను అందుకుని దూకుడు మీదున్న అడవి శేష్.. ప్రస్తుతం ‘మేజర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇది పట్టాలపై ఉండగానే మరో కొత్త సినిమాను ‘హిట్ 2’ చేస్తున్నాడు..ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది సమ్మర్ లోపు రిలీస్ అవ్వడం ఖాయమంటున్నారు ఫిలిం మేకర్స్.
06. VIJAY DEVARAKONDA – WORLD FAMOUS LOVER – 2020
చాల తక్కువ సమయంలోనే స్టార్ హీరో అయ్యాడు విజయ్ దేవరకొండ..మన రౌడీ హీరో చివరిగా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలో కనిపించాడు. ఆ తరువాత 2021లో విజయ్ నటించిన ఒక్క సినిమా కూడా రాలేదు. ‘జాతిరత్నాలు’ సినిమాలో మాత్రం చాల చిన్నపాటి క్యామియో రోల్ చేశాడు. 2022లో విజయ్ నటిస్తోన్న ‘లైగర్’ సినిమా ఆగష్టు లో విడుదల కానుంది.
05. MAHESH BABU – SARILERU NIKEVVARU – 2020

2020లో సంక్రాతి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన మహేష్ బాబు ఆ తరువాత 2022 సంక్రాంతికి ‘సర్కారు వారి పాట’ రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ ఇప్పుడు సమ్మర్ వరకు ఆగాల్సిన పరిస్థితి కలుగుతోంది..ప్రస్తుతం మహేష్ ఈ ఒక్క సినిమా మాత్రమే చేస్తున్నాడు అది పరశురామ్ డైరెక్షన్ లో.
04. RAM CHARAN – VINAYA VIDEYA RAMA – 2019

బోయపాటి డైరెక్ట్ చేసిన ‘వినయ విధేయ రామ’ సినిమాతో చివరిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రామ్ చరణ్. ఈ సినిమా డిజాస్టర్ అయింది. ఆ తరువాత నుంచి ‘ఆర్ఆర్ఆర్’ సెట్స్ పైకి వెళ్లిపోయాడు రామ్ చరణ్. ఫైనల్ గా ఆ సినిమా జనవరిలో విడుదల కానుంది. మధ్యలో ‘ఆచార్య’ సినిమాలో కూడా నటించాడు రామ్ చరణ్. అది కూడా వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
03. JR NTR – ARAVINDA SAMETHA – 2018

అప్పుడెప్పుడో త్రివిక్రమ్ డైరెక్షన్ లో’అరవింద సమేత’ సినిమాను రిలీజ్ చేశాడు ఎన్టీఆర్. ఆ సినిమా వచ్చి మూడేళ్లు దాటేసింది. ఇప్పటివరకు ఎన్టీఆర్ నుంచి మరో సినిమా రాలేదు. వచ్చే ఏడాది జనవరి 7న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ తరువాత ఇక అన్ని పాన్ ఇండియా లెవల్ సినిమాలే చేస్తారట తారక్.
02. CHIRANJEEVI – SYE RAA – 2019

ఇలాంటి పరిస్థితినే మెగాస్టార్ చిరంజీవి కూడా ఎదుర్కొంటున్నారు ‘ఆచార్య’తో. ఈ సినిమా ఎప్పుడో సిద్ధమైపోయింది. కానీ 2021లో రాలేదు. ఆఖరిగా చిరంజీవి సినిమా ‘సైరా’ 2019లో వచ్చింది. ఆ తర్వాత చిరు వరుస సినిమాలు అనౌన్స్ చేశారు. ఇప్పుడు సెట్స్ మీద ‘గాడ్‌ఫాదర్’, ‘భోళాశంకర్’, బాబీ సినిమా ఉన్నాయి. ఇది కాకుండా వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమా ఓకే చేశారు. వీటిలో రెండు సినిమాలు వచ్చే ఏడాది పక్కా.
01. PRABHAS – SAAHO – 2019

బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సిరీస్ అనంతరం ..2019లో ‘సాహో’ తరువాత ప్రభాస్ నుంచి కొత్త సినిమా రాలేదు. ‘రాధేశ్యామ్’ రిలీజ్ అవుతుందని అనుకున్నారు కానీ అది ఆలస్యమవుతూ వస్తోంది. ఫైనల్ గా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ‘రాధేశ్యామ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది..ప్రస్తుతం మన డార్లింగ్ చేతిలో నాలుగు బడా సినిమాలు ఉన్నాయి..


