10. NA PERU SURYA – NA ILLU INDIA
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా కూడా దేశ భక్తిని చాటుకుంది, బోర్డర్ కు వెళ్లి అక్కడ దేశానికి సేవ చేయాలనీ కోరుకొనే ఒక జవాన్ కథ ఇది. “నువ్వు ఇండియా లో ఉండడం కాదు, నీలో ఇండియా ఉందా” అనే డైలాగ్స్ అండ్ సీన్స్ ప్రేక్షకులని నిజంగా ఆలోచింపజేసింది. అల్లు అర్జున్ ఈ సినిమా కు కష్టపడినంత మరి ఏ సినిమాకు కష్టపడలేదు.
09. SUBASH CHANDRA BOSE
2005 లో దర్శేకేంద్రుడు రాఘవేంద్ర రావు గారి డైరెక్షన్ లో వచ్చిన సినిమా ఇది, టీవీ రిపోర్టర్ గా పని చేస్తున్న వెంకటేష్ కు గత గతజన్మ ఫ్లాష్ బ్యాక్ గుర్తుకువచ్చి అప్పట్లో దేశం కోసం తానెలా పోరాడాడో గుర్తొస్తుంది. డిఫరెంట్ స్టోరీ లైన్ తో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గా హిట్ అవ్వకపోయిన దేశ భక్తి చాటుకుంది.
08. TAGORE
మెగా స్టార్ చిరంజీవి గారి సినిమా ‘ఠాగూర్’ కూడా మంచి కథతో తెరకెక్కి దేశ భక్తిని చాటుకుంది, సొసైటీ లో లంచం లేనిదే ఏ పని జరగదంటూ.. అనే కాన్సెప్ట్ మీద వచ్చిన ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది.. VV వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఎన్నో రికార్డులు అవార్డులతో పాటు ప్రేక్షకుల మనసులని కూడా దోచుకుంది..
07. NAA DESHAM
ఎన్టీఆర్, జయసుధ, జమున కథానాయికలుగా 1982లో వచ్చిన మూవీ నా దేశం. యువ అనాథ చుట్టూ తిరిగే ఈ యాక్షన్ డ్రామాకు కె. బాపయ్య దర్శకత్వం వహించారు.
06. MAHATMA
శ్రీకాంత్ హీరోగా కృష్ణవంశీ తెరకెక్కించిన పొలిటికల్ డ్రామా మహాత్మ. ఒక వీధి రౌడీ గాంధీ మార్గంలో ప్రయాణించి ఎలా మంచి వాడయ్యాడు అనే అంశాన్ని కృష్ణవంశీ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను చాలా ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రంలో రెండో దేశభక్తి సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు కృష్ణవంశీ.
05. SARDAR PAPARAYUDU
1980ల్లో వచ్చిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా కనిపించారు. సర్దార్ పాపారాయుడు అంటూ ఈ సినిమాలో ఎన్టీఆర్ పలికిన పలుకులను ఎవ్వరూ అంత సులభంగా మర్చిపోలేరు. శ్రీదేవీ, శారద తదితరులు నటించిన ఈ చిత్రానికి దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించారు.
04. BHARATHEEYUDU
1996లో దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం మొదట తమిళ్ సినిమానే అయినప్పటికీ.. అక్కడ ఎంత విజయం సాధించిందో టాలీవుడ్లో డబ్ అయి ఇక్కడ అంతే సక్సెస్ అయింది. దేశంలో పెరిగిపోయిన లంచగొండితనాన్ని అరికట్టేందుకు ఓ భారతీయుడి పాత్రలో కమల్ చేసిన నటనను అంత ఈజీగా ఎవ్వరూ మర్చిపోరు. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
03. BOBBILI PULI
1982లో ఎన్టీఆర్ ప్రధానపాత్రలో వచ్చిన చిత్రం బొబ్బలి పులి. దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీదేవీ, మురళీ మోహన్, జగ్గయ్య, కైకాల సత్యనారాయణ తదితరులు కీలక పాత్రలలో నటించారు. దేశ భక్తి ప్రధానంగా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది.
02. KADGAM
వైవిధ్య దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన అద్భుత దృశ్యకావ్యం ఖడ్గం. భారతదేశంలో హిందూ, ముస్లింల మధ్య స్నేహ బంధం.. దేశంలో జోలికొస్తే అందరం ఒకటవుతామంటూ తెలిపే సందేశంతో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద వసూళ్లను కురిపించింది. ఇందులో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్, బ్రహ్మాజీ తదితరులు కీలకపాత్రలలో కనిపించారు.
01. ALLURI SEETHARAMARAJU
1974లో కృష్ణ ప్రధానపాత్రలో వచ్చిన చిత్రం అల్లూరి సీతారామరాజు. స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం ఎన్నో అవార్డులు, రివార్డలను సాధించింది. అంతేకాదు కృష్ణ నటించిన 100వ చిత్రం ఇది కావడం విశేషం.