10. PUSHPA – THE RISE
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ‘ఆర్య’ ‘ఆర్య 2’ వంటి చిత్రాల తర్వాత తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం మొదటి వారం వరల్డ్ వైడ్ గా రూ.105.35 కోట్లు షేర్ ను రాబట్టింది..అల్లు అర్జున్ ను ఐకాన్ స్టార్ గ మార్చి పాన్ ఇండియా హీరోగా చేసిన సినిమా ఇది.
09. BAHUBALI – THE BEGINNING
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ‘ఛత్రపతి’ తర్వాత తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.122.5 కోట్లు షేర్ ను రాబట్టింది..తెలుగు లో హైయెస్ట్ బడ్జెట్ సినిమా గ తెరకెక్కిన బాహుబలి టాలీవుడ్ లో ఒక గేమ్ చెంజర్ మూవీ అని చెప్పాలి.
08. ADIPURUSH
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మైథలాజికల్ పాన్ ఇండియా మూవీ..మొదటి వారం వరల్డ్ వైడ్ గా రూ.178.45 కోట్లు షేర్ ను రాబట్టింది..సినిమా ప్లాప్ అయినా ప్రభాస్ క్రేజ్ కు ఓపెనింగ్స్ బాగా వచ్చాయి.
07. DEVARA
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం మొదటి వారం వరల్డ్ వైడ్ గా రూ.186.21 కోట్లు షేర్ ను రాబట్టింది..RRR తరువాత జూనియర్ చేసిన సినిమా కావడంతో బారి ఓపెనింగ్స్ రావడమే కాకుండా హిట్ టాక్ కూడా తెచ్చుకుంది..
06. SAHOO
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం మొదటి వారం వరల్డ్ వైడ్ గా రూ.196.76 కోట్లు షేర్ ను రాబట్టి రికార్డులు సృష్టించింది..బాహుబలి తో తన రేంజ్ అమాంతం పెంచుకున్న రెబెల్ స్టార్ సాహో సినిమాతో దాన్ని కంటిన్యూ చేసారు!!
05. SALAAR
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం వరల్డ్ వైడ్ గా మొదటి వారం రూ.268.47 కోట్లు షేర్ ను రాబట్టింది..యాక్షన్ డ్రామా గ వచ్చిన ఈ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది..ప్రస్తుతం పార్ట్ 2 పనులు జరుగుతున్నాయి..
04. KALKI 2898 AD
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం మొదటి వారం వరల్డ్ వైడ్ గా రూ.337.54 కోట్లు షేర్ ను రాబట్టి..నాన్- రాజమౌళి రికార్డ్స్ ను నమోదు చేసింది..ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ కోసం ఇండియా మొత్తం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు..
03. RRR
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం మొదటి వారం వరల్డ్ వైడ్ గా రూ.391.47 కోట్లు షేర్ ను రాబట్టింది. ఈ సినిమా తో డైరెక్టర్ మరియు హీరోలు వరల్డ్ వైడ్ గ గుర్తింపు తెచ్చుకున్నారు..నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే!!
02. BAHUBALI – THE CONCLUSION
ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో హ్యాట్రిక్ మూవీగా రూపొందిన ఈ పాన్ ఇండియా చిత్రం..మొదటి వారం వరల్డ్ వైడ్ రూ.428 కోట్లు షేర్ ను రాబట్టి..మొన్నటి వరకునెంబర్ 1 ప్లేస్ లో ఉండేది..బాహుబలి నుంచి ప్రభాస్ నటించిన ప్రతి సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతూ సంచలనాల మీద సంచలనాలు రేపుతోంది.
01. PUSHPA – THE RULE
పుష్పరాజ్‌గా అల్లు అర్జున్, శ్రీవల్లిగా రష్మిక మందన్న మరోసారి జంటగా నటించిన సినిమా ‘పుష్ప 2: ది రూల్’. సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన పుష్ప 2 చిత్రం ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా రూ. 1,000 కోట్లకుపైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ ఫీట్‌తో ఈ యాక్షన్ డ్రామా చిత్రం అత్యంత వేగంగా ‘ఎలైట్ క్లబ్’లో చేరిన భారతీయ చిత్రంగా నిలిచింది..