10. ARANYA
టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి నటించిన ‘అరణ్య’ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ వారు ఓన్ రిలీజ్ చేసుకున్నారు. అయినప్పటికీ బ్రేక్ ఈవెన్ కు ఈ చిత్రం 16కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. కానీ ఫుల్ రన్ ముగిసేసరికి ‘అరణ్య’ కేవలం 5.10 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. అంటే 10.90 కోట్ల నష్టం వాటిల్లిందన్న మాట. కాబట్టి ఈ చిత్రాన్ని ట్రిపుల్ డిజాస్టర్ గా పరిగణించాలి. ప్రభు సాల్మన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కోలీవుడ్ హీరో విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రీయా పింగోల్కర్ కీలక పాత్రలు పోషించారు.
09. MAHASAMUDRAM
సిద్దార్థ్ రీఎంట్రీ ఇవ్వటం, టీజర్ ట్రైలర్లు దుమ్ములేపడంతో సినిమా ఖచ్చితంగా హిట్టవుతుందనుకున్నారు అంతా. అయితే రిలీజ్ అయిన మొదటి రోజే ‘మహా సముద్రం’ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. దర్శకత్వ లోపంతో సినిమా గాడి తప్పింది. పైగా కథ కూడా పాతదే కావటంతో రివ్యూలు కూడా తేడా కొట్టేశాయి. ఇంతకన్నా దారుణమైన టాక్ వచ్చిన పెళ్ళిసందడి కలెక్షన్లు బాగానే ఉన్నాయి. కారణం పెద్దగా అంచనాలు లేకపోవటమే..
08. PEDDANNA
ఈమధ్య సినిమాల స్పీడ్ ని తగ్గించిన రజనీకాంత్.. లేట్ అయినా అన్నాత్తైతో లేటెస్ట్ గా వచ్చాడు. భారీ స్టార్ కాస్ట్ తో శివ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో పెద్దన్నగా దీపావళికి వచ్చేసేంది. తెలుగులో ఈ సినిమా భారీ డిజాస్టర్ మూటగట్టుకోగా తమిళంలో మాత్రం రజని మేనియాతో వసూళ్ల పరంగా బయటపడింది. సినిమా బ్యాడ్ టాక్ తెచ్చుకున్నా రజనీ కోసం చూడాలనుకునే వారు ఓటీటీలో చూసేయొచ్చు.
07. CHECK
నితిన్ హీరోగా విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించిన చిత్రం ‘చెక్’. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా అత్యున్నతమైన డిజాస్టర్ గా నిలిచింది..ఓ దశలో ఈ సినిమాతో నితిన్ కి ఉన్న మార్కెట్ కూడా మొత్తం పోయేలా కనిపించింది. అంత బాగా ప్లాప్ అయింది ఈ సినిమా. అందుకే చాల చోట్ల రెండో షోకే ఈ సినిమా తన దుకాణాన్ని సర్దేసుకోవాల్సి వచ్చింది. రెండో రోజు తర్వాత చాలా థియేటర్ల నుంచి ఈ సినిమాని నిర్ధాక్ష్యంగా తీసి పక్కన పడేశారు.
06. SASHI
ఆది సాయికుమార్ ఇప్పటివరకు 14 సినిమాల్లో నటించాడు. అయితే, ఆ 14 సినిమాల్లో దాదాపు 12 సినిమాలు ప్లాప్స్ గానే మిగిలాయి. ఈ మార్చ్ లో తన ‘శశి’ అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా హిట్ అవుతుందని..ఆది చాలా హోప్స్ పెట్టుకున్నాడు. కానీ, ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అయి కూర్చుంది. ఎంత డిజాస్టర్ అంటే.. ఈ సినిమా మూడు రోజులకు గానూ 30 లక్షలు కూడా కలెక్ట్ చేయలేక బాక్సాఫీస్ వద్ద పూర్తిగా తేలిపోయింది. ఈ సినిమాలో ఒక పాట బాగా వైరల్ అయింది కూడా.
05. KAPATADHAARI
అక్కినేని బ్యాక్ గ్రౌండ్ తో గత 20 ఏళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సుమంత్ కెరీర్ మొదట్లో కొన్ని హిట్స్ అందుకున్నప్పటికి గత 15 ఏళ్లలో మాత్రం సరైన బాక్సాఫీస్ హిట్ అందుకకోలేదు. ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద దారుణమైన రిజల్ట్ ను అందుకుంటున్నాయి..జోనర్లు మార్చినా, గెటప్పులు మార్చినా.. ఫలితం ఉండడం లేదు. నాంది సినిమాతో పాటు విడుదలయ్యింది. అయితే ‘నాంది’ సూపర్ హిట్ కాగా ఈ సినిమా మాత్రం డిసాస్టర్ గా నిలిచింది.
04. ALLUDU ADHURS
ఈప్లాప్ అల్లుడు కోసం చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. డిజాస్టర్ సినిమాలకు సక్సెస్ మీట్ లు టాలీవుడ్ లో కొత్తేమి కాదు. ఈ సక్సెస్ మీట్ లో బెల్లం బాబు రివ్యూ లు నమ్మద్దని, సినిమా చేసినవారిని అడిగితె ఎంత ఎంజాయ్ చేసారో చెపుతారని వ్యాఖ్యానించాడు. నిజమే అదేదో బెల్లంబాబే అడిగితె బెటర్ ఏమో? పైగా ఇక్కడేదో సాధించేసినట్టు బెల్లంబాబు బాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. బెస్ట్ ఆఫ్ లక్ బాలీవుడ్ ఆడియన్స్..
03. ARADUGULA BULLET
సిటీమార్ సినిమా చూసిన వాళ్లే చాలా మంది గోపీచంద్ పని ఇక హీరోగా అయిపోయిందని అనుకున్నారు. ఇక రీసెంట్ గ వచ్చిన ‘ఆరడుగుల బుల్లెట్’ గురించి కనీసం పట్టించుకున్న వాడు కూడా లేడు..ఎంత చెత్త సినిమా అయినా రివ్యూ కోసం అయినా చూసే రివ్యూవర్లే ఈ సినిమాను వదిలేశారంటే ఆరడుగుల బుల్లెట్ ఎంత తుప్పు పట్టిపోయిందో తెలుస్తోంది. థియేటర్‌కే కాదు.. ఓటీటీకి చివరకు టీవీలో చూసేందుకు కూడా పనికిరాని సినిమా ఇది అన్న కామెంట్లు పడ్డాయి..
02. GULLY ROWDY
సినిమాను మొత్తం మీద 2.75 కోట్ల రేంజ్ లో అమ్మటంతో సినిమాకు 3 కోట్ల రేంజ్ టార్గెట్ ఫిక్సైంది. కానీ కలెక్షన్స్ చూసాక దరిదాపుల్లోకి కూడా రాలేదు..దాంతో సినిమా ఫ్లాఫ్ గా ట్రేడ్ లో నమోదు అయ్యింది. అప్పటికీ ఈ సినిమాకు ఓ రేంజిలో ప్రమోషన్ చేసారు. కానీ అసలే ఓ మాదిరి టాక్ ఉన్న సినిమాలు చూడటానికి థియోటర్ కు జనం రావటానికి ఉత్సాహం చూపలేదు. అలాంటిది బాగో లేదు అని మౌత్ టాక్, రివ్యూలు వచ్చాక సినిమా డిసాస్టర్ అవ్వక తప్పలేదు..
01. MOSAGALLU
ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఒకపక్క హీరోగా చేస్తూనే.. మరోపక్క నిర్మాతగానూ వరుసగా సినిమాలను చేసుకుంటూ తెగ కష్టపతున్నాడు విష్ణు. విష్ణు సినిమా ‘మోసగాళ్లు’ కోసం భారీగా ఖర్చు పెట్టాడు. అయినా జనం ఆ సినిమాని ఆదరించలేదు. దాంతో ఆ సినిమా వల్ల విష్ణుకి దాదాపు ఇరవై కోట్లు నష్టం అని తెలుస్తోంది. ఎలాగూ కాలేజీలు స్కూల్స్ బిజినెస్ ఉంది కాబట్టి, నష్టాన్ని విష్ణు కవర్ చేసుకున్నా.. తనకు హిట్ రాలేదు అనే బాధ మాత్రం విష్ణును తెగ ఇబ్బంది పెడుతుందట.