
అతిలోక సుందరి శ్రీదేవి గారి కూతురు జాన్వీ కపూర్ మీద తెలుగు సినిమా అభిమానులు చాల గరం గరం ఉన్నారు .. ఎందుకో తెలుసా ..తను టాలీవుడ్ పైన చూపిస్తున్న చిన్న చూపే దీనికి కారణం. రాజమౌళి #RRR మూవీ కోసం జాన్వీ ని సంప్రదించగా.. తన పాత్రా సినిమాలో లిమిటెడ్ గా ఉందంటూ ఏకంగా జక్కన్న సినిమా వద్దంది ఈ భామ. పూరి విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న ‘ఫైటర్’ సినిమాకు కూడా ముందుగా జాన్వీ నే అనుకున్నారు, తను కూడా విజయ్ అంటే ఇష్టమని ఓపెన్ గా ఒక షో లో చెప్పడంతో, తనను విజయ్ తో కలిసి నటించమని కోరగా ముందు పాజిటివ్ గా స్పందించి..చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చింది.. దింతో చేసేదేమి లేక ఫైటర్ కోసం మరో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ను తీసుకున్నాడు పూరి. తాజాగా ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కలయిక లో రానున్న సినిమాలో నటించడానికి జాన్వీ ఒప్పుకుంది అని వార్తలు వచ్చాయి, కానీ ఎన్టీఆర్ కు కూడా నో చెప్పేసింది ఈ జూనియర్ అతిలోక సుందరి.. ఇలా మనవాళ్ళు తనకు ఆఫర్స్ ఇవ్వడం, తను ఏదో ఒక సాకు చెప్పి నో అనడం ఇప్పుడు చర్చకు దారి తీసింది.. దీనిబట్టి చూస్తే తనకు మన ఇండస్ట్రీ అంటే ఎంత చిన్న చూపో అర్ధం చేసుకోవచ్చు. ఇదే విషయం మీద మనవాళ్ళు తనని ఇప్పుడు ఏకిపారేస్తున్నారు, జాన్వీ పధ్ధతి మార్చుకోమని.. మరి భవిషత్లో అయినా తన పధ్ధతి మార్చుకుంటుందో లేదో చూడాలి.

