in

TOLLYWOOD BAKASURAS!

వరయినా భారీగా భోజనం చేస్తే వీడెవడ్రా బాబు బకాసురుడు లాగా ఉన్నాడే అంటారు. భారతం లో బకాసురుడు ఒక్కడే కానీ టాలీవుడ్ లో మనకు ఇద్దరు బకాసురులు, ఒకరు కైకాల సత్యనారాయణ,మరొకరు చంద్ర మోహన్. ఇద్దరు మంచి భోజన ప్రియులు, సత్యనారాయణ ఒక్కరే ఆరు గిన్నెల కారియర్ ను లాగించేసేవారట, చంద్ర మోహన్ అది, ఇది అని లేదు అన్ని కెరియర్ లు వెతికి తనకు ఇష్టం అయినవి అన్ని గుట్టు చప్పుడు కాకుండా తినేసేవారట. ఆ రోజుల్లో చంద్ర మోహన్ గారిని ఎవరయినా మీ హాబీ ఏమిటి సర్ అంటే “కంచం కనిపిస్తే తినటం, మంచం కనిపిస్తే నిద్ర పోవటం” అని సరదాగా చెప్పే వారట. వీరిద్దరి మధ్య జరిగిన ఒక సరదా సంఘటన గురించి చెప్పటానికే ఈ సుత్తి అంతా. ” పెళ్లి చూపులు” సినిమా షూటింగ్ కోసం కోనసీమకు వెళ్లిన వీరిద్దరూ కలసి 150 పీతల వేపుడు తినేశారట!!!

అయ్యా బాబోయ్!!! నిజమండి బాబు మీ మీద ఒట్టు!!! షూటింగ్ జరుగుతున్నపుడు అక్కడి మోతుబరి అయిన రాజు గారు, వీరిద్దరి భోజన ప్రీతీ తెలుసుకొని వీరి కోసం స్పెషల్ గ వంటలు చేయించి పంపే వారట, గోదావరి జిల్లాల రాజుల మర్యాద ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. ఆయన ఎంత పంపిన వీరిద్దరూ పిసరు కూడా మిగల్చకుండా ఊడ్చేసే వారట. అది చూసిన రాజు గారు వీళ్ళ సంగతేందో చూద్దామని ఒక రోజు 150 పీతల వేపుడు చేయించి పట్టుకొచ్చారట,” ఆయ్ ఈ ఎపుడంతా మీరిద్దరు భోంచేయాలండీ మరే”, అని పట్టు బట్టి కుర్చున్నారట. మొదట మొహమాట పడిన మన బకాసుర ద్వయం, ఆ తరువాత విజృంభించారట,అర గంటలో మొత్తం 150 పీతలు గుటకాయ స్వాహా చేసేసారట. తినాలని కోరిక ఉన్నా అందరు ఆ విధం గ తిన లేరు, అది కొందరికి మాత్రమే సాధ్యం..!!

anchor Anasuya Falls Victim to Online Shopping Fraud!

rashmika: love changes people and their thoughts