తొలిప్రేమ’ చిత్రంలో పవన్ కళ్యాణ్‌కి చెల్లెలిగా నటించిన వాసుకి మళ్లీ 23 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తోంది. సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘అన్నీ మంచిశకునములే’ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. స్వప్నదత్ నిర్మించిన ఈ చిత్రం మే 18న విడుదలవుతోంది. ఈ సందర్భంగా వాసుకి చెప్పిన విశేషాలు. ‘‘తొలిప్రేమ’ తర్వాత నాకు చాలా అవకాశాలు వచ్చాయి. కానీ ఫ్యామిలీ వర్క్‌లో బిజీగా ఉండటంతో చేయడం కుదరలేదు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు యూకేలో చదువుతున్నారు.
పాప మెడిసిన్ ఫోర్త్ ఇయర్, బాబు సెకండ్ ఇయర్ ఆర్కిటెక్చెర్. ఆనంద్ సాయి ఆయన పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఏదైనా చేయడానికి నాకు సమయం కుదిరింది. ఇలాంటి టైమ్‌లోనే నందిని రెడ్డి చెప్పిన కథ బాగా నచ్చింది. పైగా స్వప్న కూడా ఎప్పుడూ సినిమా చేయమని అడుగుతుండేది. ఫైనల్‌గా ఈ కథ కుదిరింది. ‘తొలిప్రేమ’ చిత్రాన్ని దృష్టిలో పెట్టుకునే ఇందులో నటించా. చాలా క్యూట్ సిస్టర్ క్యారెక్టర్‌లో కనిపిస్తా. తమ్ముడు ఏం చేసినా సపోర్ట్ చేసే అక్క పాత్ర నాది. నాకు, సంతోష్ పాత్రకు మంచి బాండింగ్ ఉంటుంది..”!