
టెక్నాలజీని వినియోగించుకోవడానికి, దుర్వినియోగం చేయడానికి చాలా తేడా ఉంది. సాంకేతికత జీవితాన్ని సులభతరం చేయడానికే కానీ, సంక్లిష్టం చేయడానికి కాదని నేను భావిస్తాను” అని శ్రీలీల తన పోస్టులో పేర్కొన్నారు. ఈ రంగంలో ఉన్న ప్రతీ అమ్మాయి కూడా ఎవరో ఒకరికి కూతురు, సోదరి, స్నేహితురాలు అని గుర్తుంచుకోవాలని అన్నారు. తాము సురక్షితమైన వాతావరణంలో ఉన్నామనే భరోసాతోనే చిత్ర పరిశ్రమలో పనిచేయాలని కోరుకుంటున్నామని తెలిపారు..
తన పని ఒత్తిడి, షెడ్యూళ్ల కారణంగా ఆన్‌లైన్‌లో జరుగుతున్న చాలా విషయాలు తన దృష్టికి రాలేదని, శ్రేయోభిలాషులు చెప్పడంతోనే ఈ విషయం తెలిసిందని శ్రీలీల వివరించారు. ఫేక్ కంటెంట్ పరిణామం తనను తీవ్రంగా కలచివేసిందని, మానసికంగా కుంగదీసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనలాగే తోటి నటీనటులు కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని, అందరి తరఫున తాను మాట్లాడుతున్నానని అన్నారు. ఈ వ్యవహారాన్ని ఇకపై సంబంధిత అధికారులు చూసుకుంటారని ఆమె స్పష్టం చేశారు..!!

