డేనియల్ బాలాజీ,(కె.సి.బాలాజీ) స్వతహాగా తమిళ నటుడు కానీ, తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి, తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు. చాలా మంది నటి, నటులు నిజ జీవితంలో కూడా నటిస్తుంటారు, కానీ బాలాజీ మాత్రం తెర మీద మాత్రమే నటిస్తూ, నిజ జీవితం లో జీవించిన అరుదయిన కొంత మంది నటి,నటులలో ఒకరు. ఫిలిం ఇన్స్టిట్యూట్ లో డైరెక్షన్ లో డిప్లొమా తో సినీ రంగ ప్రవేశం చేసి, వివిధ విభాగాలలో పని చేసి అనుభవం సంపాదించి, అనుకోకుండా నటుడు అయిన నటుడు బాలాజీ. డైరెక్టర్ నటుడు అయితే ఆ నటనలో ఎంత పదును, లోతు ఉంటుందో దానికి ఉదాహరణ డేనియల్ బాలాజీ. తాను నటించిన భిన్నమయిన రోల్స్ లాగానే, ఆయన జీవన విధానం కూడా విభిన్నమయిన శైలిలో ఉండేది. మూస పాత్రలు చేయకుండా..
చేసే ప్రతి పాత్ర డిఫరెంట్ గ ఉండే విధంగా జాగ్రత్త తీసుకొనే వారు. చాలా పెద్ద కుటుంబం, అంటే పదకొండు మంది సంతానం లో ఒకడిగా పుట్టిన బాలాజీ, చిన్న వయసు నుంచి కుటుంబ బాధ్యతలు, కష్టాలు అనుభవించి, వయసు వచ్చే సరికి వివాహం మీద విముఖత్వం పెరిగి, వివాహానికి దూరం గ ఉండిపోయారు. జీవితాన్ని చాల లైట్ గ తీసుకొని, తన జీవితం తనకు ఇష్టమయిన రీతిలో బ్రతికేసారు. ఇంకొక విభిన్నమయిన విషయం ఏమిటి అంటే, తన సొంత డబ్బు తో ఒక గుడి కట్టించిన వ్యక్తి బాలాజీ. సామాజిక స్పృహ తో పాటు ఆధ్యాత్మికత కూడా కలిగిన బాలాజీ ఆకస్మిక మరణం చాల బాధాకరం. మార్చ్ 29 తారీకు, 2024 అర్ధ రాత్రి గుండె పోటు తో ఆకస్మిక మరణం చెందటం చాల విషాదకరం. దక్షిణాది ప్రేక్షకులు ఒక మంచి నటుడు, మంచి మనిషిని కోల్పోవటం బాధాకరం..!!