in

‘The Rana Connection’ with Streaming giant Prime Video!

జినీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న ’వెట్టియాన్‌’ లో రానా విలన్‌ గా నటిస్తున్నాడు. దీనికి ’జై భీం’ ఫేమ్‌ టిజె జ్ఞానవేల్‌ దర్శకుడు. ఈ సినిమా చిత్రీకరణ ఇంకా కొంచెం మిగిలి వుంది అని తెలిసింది. ఇదిలా ఉండగా రానా దగ్గుబాటి ఈమధ్య చాలా చిన్న సినిమాలని ప్రోత్సహిస్తున్నాడు. ఇంతకు ముందు ’పరేషాన్‌’ అనే సినిమాని ప్రోత్సహించినట్టుగానే ఇప్పుడు ’35’ అనే సినిమాకి రానా ముందుండి నడిపిస్తున్నాడు. అలాగే మలయాళం సూపర్‌ స్టార్‌ దుల్కర్‌ సల్మాన్‌ తో ఒక సినిమా నిర్మిస్తున్నాడు రానా.

ఇవి కాకుండా రానా దగ్గుబాటి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో కోసం ఒక షో చేస్తున్నట్టుగా తెలిసింది. ఈ షో కి ’ది రానా కనెక్షన్‌’ అని పిలుస్తున్నారు. ఇందులో రానా దగ్గుబాటి దక్షిణాదికి చెందిన అగ్ర నటులను ఒక దగ్గరకి చేర్చి వారితో సంభాషించనున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇంతకు ముందు నటులతో చాలా షో లు వచ్చినా, రానా ఇది తన మార్కు వుండేటట్టుగా ఒక అద్భుతమైన కాన్సెప్ట్‌ తో వెళుతున్నట్టుగా తెలిసింది. ఈ షో కోసమని రామానాయుడు స్టూడియో లో ఒక సెట్‌ కూడా తయారవు తోంది అని వినికిడి..!!

Ravi Teja trolled for romancing a heroine half his age!

Indian 2