తెలుగు మేటి నటుడు యెన్.టి.ఆర్
హీరోలు చేసిన, ఒకే ఒక్క నటుడు యెన్.టి.ఆర్. పౌరాణిక, సాంఘిక, చిత్రాలలో ఎన్నో నెగటివ్ రోల్స్ ను హీరోలు చేసిన ఘనత ఒక్క యెన్.టి.ఆర్. కె చెందుతుంది. ఆయన దుర్యోధనుడిగా నటిస్తే ఆ పాత్రకు సుయోధన సార్వభౌముడిగా గుర్తింపు, రావణాసురిడిగా కనిపిస్తే రావణ బ్రహ్మ గ గుర్తింపు తీసుకొని వచ్చారు. ఇండస్ట్రీ లో ఒక పాపులర్ హీరో అయి ఉండి కూడా ఎన్నో నెగటివ్, డి గ్లామరైజ్డ్ రోల్స్ చేసి సెహబాష్ అనిపించుకున్న మేటి నటుడు యెన్.టి.ఆర్..
పాత్రకు జీవం పొసే మహానటుడు ఎన్టీఆర్
గురజాడ వారి కన్యాశుల్కం నాటకం సినిమాగా చేసినప్పుడు అందులోని అవకాశవాది గిరీశం పాత్రను పోషించటానికి అప్పటి హీరోలు ఎవరు ముందుకు రాలేదు. కానీ, యెన్.టి.ఆర్. తనదైన శైలిలో ఆ పాత్రకు జీవం పోశారు. నెగటివ్ షేడ్స్ తో, ఒక పారాసైటిక్ క్యారెక్టర్ అయిన గిరీశం ని తన నటనతో హీరో చేసారు. యెన్.టి.ఆర్. ఏ పాత్ర పోషించిన, ఆ పాత్ర పది కాలాల పాటు ప్రేక్షకుల మదిలో నిలిచి పోయే విధంగా నటించిన ఘనత ఒక్క యెన్.టి.ఆర్. కె చెందుతుంది. ఎందరో నటులు హీరోలు అయి ఉండవచ్చు, కానీ పాత్రలను హీరోలు చేసిన మహానటుడు ఒక్క యెన్.టి.ఆర్. మాత్రమే. దట్ ఇస్ వై, వన్ అండ్ ఓన్లీ యెన్.టి.ఆర్ అంటాను మరి మీరు ఏమంటారు?