దాదాపు ఒక శతాబ్దం వయసు ఉన్న భారతీయ సినీ చరిత్రలో జరిగిన మొదటి మర్డర్ మిస్టరీ, మర్డర్ అంటే వెండితెర మీద జరిగినది కాదు, నిజ జీవితం లో, సినీ పరిశ్రమలో, ఒక సినీ జర్నలిస్ట్ కి, ఒక అగ్ర నటుడు ఏం.కె. త్యాగరాజ భాగవతార్ మధ్య జరిగిన ఒక వివాదం కారణం గ జర్నలిస్ట్ లక్ష్మి కాంతన్ హత్య గావింపబడ్డాడు. ఇప్పటిలాగా సోషల్ మీడియ లేని రోజులలో,” సినిమా చూడు ” అనే పేరుతో ఒక సినీ పత్రిక మొదలయ్యింది. ఆ పత్రికలో అప్పటి వరకు దక్షిణాది లో లేని యెల్లో జోర్నలిజం కు తెర లేపింది, ఆ పత్రిక సినిమా వారి గురించి పుంఖాను,పుంఖాలు గ అసభ్య రాతలు వ్రాయటం మొదలు పెట్టింది, కానీ కొద్దీ రోజులకే మూత పడింది, ఆ పత్రిక ఎడిటర్ గ పని చేసిన లక్ష్మి కాంతన్” హిందూ నేషన్” అనే పత్రిక ను కొని తనకు అలవాటైన అసభ్య రాతలు మళ్ళీ, వ్రాయటం మొదలు పెట్టాడు, సినీ పరిశ్రమకు చెందిన గాసిప్స్ వ్రాస్తూ, వారిని బ్లాక్ మెయిల్ చేయటం వృత్తిగా కొనసాగించాడు. అప్పటికే తమిళ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ గ వెలుగొందుతున్న ఏం.కె. త్యాగరాజ భాగవతార్, పాపులర్ కమెడియన్ ఏం.ఎస్. కృష్ణన్ , టాప్ ప్రొడ్యూసర్, పక్షిరాజా స్టూడియోల అధిపతి అయిన ఎస్.ఏం.శ్రీరాములు నాయుడు గురించి పిచ్చి రాతలు వ్రాసే వాడు లక్ష్మి కాంతన్..
రాయటమే కాదు, తాను అడిగిన డబ్బు ఇవ్వక పోతే ఇంకా ఛండాలం గ రాస్తానని బెదిరించేవాడు లక్ష్మి కాంతన్. ఇతని ఆగడాలు భరించలేక ఈ ముగ్గురు అప్పటి తమిళనాడు గవర్నర్ ని కలసి లక్ష్మి కాంతన్ మీద పిర్యాదు చేసారు, దెబ్బకి పత్రిక ను బాన్ చేసారు గవర్నర్, దాని మీద కోర్ట్ కి ఎక్కాడు లక్షి కాంతన్. ఈ క్రమం లోనే ఒక రోజు రిక్షా లో వెళుతున్న లక్ష్మి కాంతన్ ను వడివేలు అనే వ్యక్తి నడి రోడ్ మీద హత్య చేసాడు. అప్పటికే వ్యక్తిగత విబేధాలు ఉన్న ఈ ముగ్గరే హత్య చేయించి ఉంటారని, త్యాగరాజ భాగవతార్, కృష్ణ, శ్రీరాములు నాయుడు ను అరెస్ట్ చేసారు పోలీసులు. తెర వెనుక జరిగిన విషయం ఏమిటంటే? వడివేలు కి, లక్ష్మి కాంతన్ కి ఉన్న విబేధాలు తెలుసుకున్న ఈ త్రయం, వడివేలు ను సంప్రదించారు, వడివేలు ను రెచ్చ గొట్టి, అడిగినంత డబ్బులు ఇస్తామని ఆశ చూపించారు..
తన కక్ష తీరటమే కాకుండా అదనంగా డబ్బులు కూడా వస్తాయనగానే, వడివేలు, మరో వ్యక్తితో కలసి లక్ష్మి కాంతన్ ను దారుణంగా నడి రోడ్డు మీద కత్తి తో పొడిచి చంపాడు వడివేలు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఈ విషయాలు బయట పడటం తో ఈ ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది, హత్య సమయం లో తాను బొంబాయి లో ఉన్నట్లు, గట్టి సాక్షాలు చూపించిన శ్రీరాములు నాయుడు శిక్ష నుంచి తప్పించుకున్నారు. ఆ తరువాత జరిగిన విచారణలో, వివిధ కోర్టుల తీర్పులు, చివరకు వీరు ఇద్దరు కూడా నిర్దోషులు గ విడుదల అయ్యారు. ఆ తరువాత కొన్ని సినిమాలలో నటించిన అవి విజయవంతం కాలేదు, కెరీర్ మసక బారింది, ఆ తరువాత కొంత కాలానికి త్యాగరాజ భాగవతార్ గుండెపోటుతో చనిపోయారు. ఆ తరువాతి సినీ పరిశ్రమలో ఎన్నో ఆత్మా హత్యలు జరిగాయి కానీ హత్యలు జరిగిన దాఖలాలు లేవు, బహుశా సినీ పరిశ్రమలో ఇదే మొదటి మరియు చివరి హత్య కాబోలు..!!