చిరంజీవి గారు చిత్ర పరిశ్రమలో ఎటువంటి సపోర్ట్ లేకుండా, స్వయంకృషి తో ఎదిగిన మెగా స్టార్ అని అందరికి తెలిసిన విషయమే. అలా చెప్పటం చాల సులువయిన విషయం ఆయన ఎదుగుదల వెనుక ఆయన పడిన కష్టం, తపన, వెంటాడే నిరాశ నిస్పృహ లను దరి చెర నీయకుండా పడిన శ్రమ కు ఎన్ని ఉదహారణలు చెప్పిన తక్కువే. చిరంజీవి గారి మొదటి సినిమా ప్రాణం ఖరీదు చిత్రంలో, నలుగురు పాలేర్లు వరుసగా నిలబడి ఒకరి తరువాత ఒకరు కాళ్ళు చేతులు కడుక్కొని లోపలి వెళితే అక్కడ సావిత్రి గారు వీరికి భోజనం పెట్టె సీన్ షూట్ చేస్తున్నారు, అది చిరంజీవి గారు మొదటి సారిగా కెమెరా ముందు నటిస్తున్న సీన్. అసిస్టెంట్ డైరెక్టర్ సీన్ గురించి చెప్పగానే వరుసలో చివరగా స్టాటిక్ గ నిలబడటం కంటే ఏదైనా డిఫ్రెంట్ గ కనిపిస్తే బావుంటుంది అనే ఉద్దేశం తో దానికి ముందు సీన్ ఏమిటి అని ఆ అసిస్టెంట్ డైరెక్టర్ అని అడిగారట.
పొలం పని చేసుకొని యజమాని ఇంటికి భోజనం కోసం వచ్చారు, భోజనం సీన్ ఇప్పుడు తీస్తున్నాము అని చెప్పాడట. అది వినిన చిరంజీవి గారు ప్రక్కన ఉన్న గడ్డి వాము నుంచి నాలుగు గడ్డి పరకలు తుంచి నెత్తి మీద, వంటి మీద చల్లుకొని, ఒకరు తరువాత ఒకరు కాళ్లు కడుగుతూన్న క్రమంలో తన నెత్తి మీద, ఒంటి మీద ఉన్న గడ్డి ని శుభ్రం చేసుకొంటూ ఉండి, చివరగా కాళ్లు కడుగుకొని లోపలి కి వెళ్లబోయారట. చిరంజీవి గారి ఇన్వొల్వెమెంట్ అంతా గమనించిన కెమరామెన్ తమ్ముడు, నీ పేరేమిటి అని అడిగారట, నీ ఇన్వొల్వెమెంట్ బాగుంది, వెరీ గుడ్ అన్నారట, మొదటి రోజు మొదటి షాట్ లోనే కెమరామెన్ అలా అనగానే ఎంతో సంతోషం కల్గింది, ఆ తరువాతే కాదు ఈనాటికి అదే ఇన్వొల్వెమెంట్, అదే కమిట్మెంట్ తో ఆపని చేయ బట్టే మెగా స్టార్ అయ్యారు, అందరు ఆయన గురించి చెప్పే వారే కానీ అయన లా చేసే వారు తక్కువే అందుకే ఆయన మెగా స్టార్.