
రెబల్ స్టార్ గ పేరున్న కృష్ణం రాజు గారు వెండి తెర మీద ఎంతో మంది విలన్లను చితకబాదే వారు, కానీ నిజ జీవితం లో ఒక సందర్భం లో వారి నాన్న గారు కృష్ణం రాజు గారిని కొరడా తో చితకబాదారట, ఎందుకు, ఏమిటి అనే విషయం తెలుసోకావాలంటే మీరు ఈ మ్యాటర్ చదవ వలసిందే. కృష్ణం రాజు గారు 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, ఇంట్లో హాలులో టేబుల్ మీద కాళ్ళు బార్ల చాపుకుని ఎదో బుక్ చదువుకుంటున్న సమయం లో వారి నాన్న గారి గురించి ఎవరో పెద్దాయన వస్తే, కృష్ణం రాజు గారు అలాగే కూర్చొని నాన్న గారు లేరు అని సమాధానం చెప్పారట. అప్పుడే అక్కకడకు వచ్చిన వారి నాన్న గారు, ఆ పెద్దాయనతో మాట్లాడి పంపించి, హాలులో ఉన్న కొరడా తీసుకొని పెద్ద వారితో మాట్లాడే పద్దతి ఇదేనా అంటూ చితకబాదేశారట. ఆ దెబ్బల నుంచి కోలుకోవడానికి మూడు రోజులో పట్టిందట కృష్ణం రాజు గారికి. అందుకే అయన తెర మీద రెబెల్ క్యారెక్టర్స్ చేసిన, స్వతహాగా చాల మృదు స్వభావి మరియు తన తోటి వారిని చాల గౌరవించే వారు, ఎంతగా అంటే, ఎవరైనా ఆయనను కలవటానికి వస్తే అయన లేచి నిలబడి, వచ్చిన వారిని ఆహ్వానించి వారు కూర్చున్న తరువాత అయన కూర్చునే వారు. చిన్న తనం లో తన తండ్రి నేర్పిన పాఠం ఆయన ఎప్పటికి మరువలేదు, అప్పుడు ఆయనకు బాధ కలిగిన, వారి తండ్రి గారు నేర్పిన సంస్కారాన్ని మాత్రం అయన అలవర్చుకున్నారు.

