గత కాలపు అందాల హీరోయిన్, ప్రస్తుతం క్యారెక్టర్ నటి, లేడీ విలన్ అయిన నటి నళిని గారి మొట్ట మొదటి తెలుగు (డబ్బింగ్) చిత్రం “ప్రేమసాగరం” 1983 లో తెలుగునాట రిలీజ్ అయి సంచలన విజయం సాధించిన టీనేజ్ లవ్ స్టోరీ. రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ లో 100 డేస్ నడిచింది, రాజమండ్రి వంటి చోట 365 డేస్ ఆడిన ఏకైక డబ్బింగ్ సినిమా ఆ రోజుల్లో. ఆ చిత్రంలో నటించినప్పుడు నళిని గారు 8 వ తరగతి చదువుతున్నారు. సినిమా తమిళ్ మరియు తెలుగు భాషలలో హిట్ అయింది.
ఆ తరువాత నళిని గారు స్కూల్ కి వెళితే చుట్టు పక్కల అన్ని స్కూల్స్ స్టూడెంట్స్ ఆమె ను చూడటానికి స్కూల్ ను చుట్టూ ముట్టారు. నళిని గారి హ్యాండ్ రైటింగ్ బాగో లేదని కొట్టిన తన స్కూల్ ప్రిన్సిపాల్ ఆమె వద్దకు వచ్చి, చాల బాగా యాక్ట్ చేసావు అని, నళిని ఆటోగ్రాఫ్ అడిగి తీసుకున్నారట. అందుకే అంటారు పెద్దలు” చేతివ్రాత బాగున్న వారి తలరాత బాగోదని”, అలాగే చేతివ్రాత బాగోలేదని దెబ్బలు తిన్న నళిని గారు, తలరాత బాగుండటం తో ఎవరి చేతిలో అయితే దెబ్బలు తిన్నారో వారికే ఆటోగ్రాఫ్ ఇవ్వగలిగారు. విధి అంటే ఇదే కాబోలు.