జీతూ జోసెఫ్, ఒకప్పుడు ఈ పేరు చాలామంది కి తెలియదు. దృశ్యం 2 తో ఇప్పుడు భారతీయ ప్రేక్షకులకు సుపరిచితుడు అయ్యాడు. డైరెక్టర్ కావాలి అనుకున్న జీతూ జోసెఫ్ ను డైరెక్టర్ గ పరిచయయం చేసింది వాళ్ళ అమ్మ లీలమ్మ. ఆవిడ ఎమన్నా సినీ నిర్మాత? కాదు,కొడుకు కోసం ఉన్న ఆస్తులు తాకట్టు పెట్టి నిర్మాత గ మారి ,కొడుకును డైరెక్టర్ గ పరిచయం చేసింది లీలమ్మ. మలయాళ డైరెక్టర్ జై రాజ్ దగ్గర రెండు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గ పని చేసిన జీతూ జోసెఫ్, ఒక కథ రెడీ చేసుకొని నిర్మాతకు వినిపించాడు బాగుంది, హీరో దిలీప్ తో చేద్దాం అన్నాడు కానీ కార్యరూపం దాల్చలేదు.
డిటెక్టీవ్ అని ఇంకొక కధ రెడీ చేసుకొని హీరో సురేష్ గోపి గారికి వినిపించాడు, నిర్మాత ఉంటె సినిమా చేద్ధాం అన్నారు అయన, కానీ కొత్త డైరెక్టర్ ని నమ్మి పెట్టుబడి పెట్టె నిర్మాత దొరకలేదు. నిర్వేదం లో ఉన్న జీతూ జోసెఫ్ వెన్ను తట్టి ఎవరు లేక పోతే ఏంటి, మీ అమ్మ ఉంది అని, ఉన్న కొద్దిపాటి ఆస్తిని తాకట్టు పెట్టి, సినిమా మొదలు పెట్టారు, పెట్టుబడి సరిపోక మధ్యలో ఆగిపోయింది, సినిమా ప్రోగ్రెస్ గురించి విన్న నిర్మాత మహిత్ అండగా నిలిచి సినిమా పూర్తి చేసారు. డిటెక్టీవ్ సినిమా సూపర్ హిట్ అయింది. 13 ఏళ్ళ ప్రయాణం, తీసింది 10 సినిమాలు అందులో 9 సూపర్ హిట్. ఇప్పుడు దృశ్యం 2 తో వెంకటేష్ గారిని డైరెక్ట్ చేస్తూ తెలుగు వారి కి కూడా పరిచయం కాబోతున్న జీతూ జోసెఫ్ కు వెల్కమ్ చెబుదాం. లీలమ్మ గారికి సెల్యూట్ చేద్దాం..