
సాధారణంగా మన తెలుగు చలన చిత్ర రంగం లో హీరోల కొడుకులు హీరోలు అవటం చూసాం, కానీ ఒక హీరోయిన్ కొడుకు హీరో అవటం ఒక్క తరుణ్ విషయయం లోనే జరిగింది, ఇదే కాకూండ, తల్లి, కొడుకుల మధ్య కెరీర్ పరంగా చాల సిమిలారిటీస్ ఉన్నాయి. రోజా రమణి గారు 6 సంవత్సరాల వయసులో స్కూల్ కి వెళ్లకముందే, ఏ. వి. ఎం. స్టూడియో కి భక్త ప్రహల్లాద షూటింగ్ కోసం వెళ్లారు. ఫస్ట్ మూవీ కి నేషనల్ అవార్డు మరియు నంది అవార్డు దక్కించుకున్నారు. 13 ఇయర్స్ ఏజ్ లోనే ” చెంబరసి ” అనే మలయాళ చిత్రం లో హీరోయిన్ గ నటించారు. అదే విధంగ తరుణ్ కూడా 7 ఇయర్స్ ఏజ్ లోనే “అంజలి” మూవీలో నటించారు నేషనల్ అవార్డు దక్కించుకున్నారు. 16 ఇయర్స్ ఏజ్ లోనే ” నువ్వే కావాలి ” అనే మూవీ లో హీరో గ నటించారు, నంది అవార్డు సాధించారు. తల్లి,తండ్రి లాగా నటుడు అవటమే కాకా, తల్లి పొందిన రికార్డ్స్ అన్ని తాను కూడా పొందారు. మగపిల్లలు తల్లి పోలిక తో, ఆడపిల్లలు తండ్రి పోలికలతో పుడితే అదృష్టవంతులు అవుతారు అంటారు పెద్దలు. తరుణ్ విషయం లో మాత్రం అది నిజం అయింది అని చెప్పుకోవాలి. తరుణ్ అదృష్టవంతుడే కాదు, తల్లి లాగా మంచి నటుడు కూడా.

