కోడూరి విశ్వ విజయేంద్రప్రసాద్ పాపులర్ సినీ రచయిత,డైరెక్టర్, ” బాహుబలి ” తో తెలుగు సినిమా దమ్మును ప్రపంచానికి పరిచయం చేసారు. సల్మాన్ ఖాన్ ని భజరంగి భాయ్ జాన్ గ సాఫ్ట్ క్యారెక్టర్ లో చూపించిన ఘనత కూడా ఈయనదే. దర్శకుడు రాజమౌళి గారి తండ్రి అయిన విజయేంద్రప్రసాద్ గారి సెల్ ఫోన్ లో స్క్రీన్ సేవర్ గ ఎవరి ఫోటో ఉంటుంది అంటే మీరు ఏమంటారు? తనకు పుత్రోత్సహాన్ని ఇచ్చిన ,రాజమౌళి ఫోటో అని సమాధానం ఇస్తారు కదూ. అయితే మీరు తప్పులో కాలు వేసినట్లే, ఆయన తన ఫోన్ లో స్క్రీన్ సేవర్ గ తన “ప్రియమయిన శత్రువు” ఫోటో పెట్టుకున్నారు. ఎవరా” ప్రియమయిన శత్రువు” అనే కదా మీ సందేహం?
అతను ఎవరో కాదు మన డైరెక్టర్ పూరి జగన్నాథ్. అవునండి బాబు ఒట్టు, విజయేంద్రప్రసాద్ గారి ఫోన్ లో స్క్రీన్ సేవర్ గ పూరి జగన్ ఫోటో ఉంటుంది, దానికి కారణం కూడా ఆయనే చెప్పారు, పూరి రాసినంత వేగంగా తాను వ్రాయలేనని, హీరో, విలన్ కి మధ్య తగాదా చిటికెలో పెట్టేస్తారని, తాను ఆలా చేయటానికి ఒక పది సీన్ లు వ్రాస్తేగానీ చేయలేనని, ఆ టెక్నీక్ పట్టుకోవాలని ఎంత ప్రయత్నించినా వీలుకావటం లేదని. అందుకే పూరి జగన్నాథ్ ఫోటో స్క్రీన్ సేవర్ గ పెట్టుకున్నానని చెప్పారు, మరి రింగ్ టోన్ ఏమి పెట్టుకున్నారో మరి? అది మాత్రం మనకు తెలియదండి, అది సంగతి..