గండ్రోతు వీర వెంకట వినాయక్, తెలుగు సినీ పరిశ్రమలో వినయ్ గ, తెలుగు ప్రేక్షకులకు వి.వి. వినాయక్ గా సుపరిచితుడు ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే మనస్తత్వం, కుటుంబం, స్నేహితులు, సొంత ఊరు అన్న విపరీతం అయిన ప్రేమ ఉన్న గొప్ప మనిషి. ఆయన పేరు లాగానే ఆయన ఆయన మనసు కూడా చాల పెద్దది, దానికి నిదర్శనం ఈ మధ్య వినాయక్ గారు తన సొంత ఊరు అయిన చాగల్లు వాసులకు చేసిన సహాయం. ఈ కరోనా కాలం లో తాను, తన కుటుంబం సురక్షితం గ ఉండాలని అందరు చాల జాగ్రత్తలు పాటిస్తున్నారు. వినాయక్ గారు మాత్రం తాను, తన కుటుంబమే కాదు తన ఊరి ప్రజలు కూడా సురక్షితం గ ఉండాలనే ఆలోచనతో, హైదరాబాద్ లోని ప్రముఖ హోమియో వైద్యుడి తో తన ఊరిలోని వారందరికీ రోగనిరోధక శక్తీ పెంచే హోమియో వైద్యాన్ని ఉచితం గ అందించారు.
దాని ప్రభావం తో చాగల్లులో కరోనా బారిన పడే వారి సంఖ్య చాల తక్కువగా నమోదయింది, ఒక వేళ కరోనా సోకినా, వారు నాలుగు, అయిదు రోజుల్లో కోలుకుంటున్నారు, మరణాలు కూడా గణనీయం గ తక్కువ. ఈ హోమియో మందులకు ఆయన సుమారు 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు, తన కుటుంబానికి పెద్ద కొడుకు అయిన వినాయక్ గారు, చాగల్లు కె పెద్ద కొడుకులా ఊరిని కరోనా ధాటి నుంచి కాపాడే ప్రయత్నం చేయటం నిజం గ ఎంతో గొప్ప విషయం. బాగుండటం అంటే మనం ఒక్కరమే బాగుంటటం కాదు, మన చుట్టూ ఉన్న వారు కూడా బాగుండటం అని నిరూపించిన మనసున్న శ్రీమంతుడు, వినాయక్ గారు..