భక్త ప్రహల్లాద అనే చిత్రం తెలుగు భాషలో మొత్తం మూడు సార్లు తీశారు . మొదటి సారిగా 1932 లో తెలుగులో మొదటి టాకీ చిత్రం గ హెచ్.ఏం. రెడ్డి గారు నిర్మించారు, అందులో ప్రహల్లాదుడిగా షియాజీ, కృష్ణా రావు అనే బాల నటుడు నటించాడు. ఆ తరువాత 1942 నిర్మించారు, అందులో ప్రహల్లాదుడిగా జి. వరలక్ష్మి గారు నటించారు. 1967 లో ఏ.వి.ఏం వారు నిర్మించిన భక్త ప్రహల్లాద చిత్రం లో ప్రహల్లాదుడు గ రోజా రమణి నటించారు. ఆ చిత్రం లో నిజం అయిన పామును మేడలో వేసుకొని ఎటువంటి బెరుకు లేకుండా డైలాగులు, పద్యాలు దంచేస్తున్న ఆ చిన్న పిల్లను చూసి అందరు ఆశ్చర్య పోయారు. హిరణ్యకశ్యపుడు గ ఎస్.వి.ఆర్. నటించారు.
ఒక విధం గ ఆయనతో సమానం గ నటించింది బేబీ రోజా రమణి. అక్కినేని నాగేశ్వర్ రావు గారు ఆ సినిమా చూసి ముగ్దులయి, అంత చిన్న పాపా అంత పెద్ద పద్యాలకు లిప్ మూవ్మెంట్ తప్పకుండా నటించటం చూసి ఆశ్చర్యపోయి రెండో సారి కూడా ఆ సినిమా చూసారని ఆయనే చెప్పుకున్నారు. అప్పటి భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారు కూడా ఆ సినిమా చూడాలని ఆకాంక్ష వెలిబుచ్చటం తో ఈ చిత్ర నిర్మాతలు రాష్ట్రపతి గారి కోసం రాష్ట్రపతి భవన్ లో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసారు. అందులో రోజా రమణి నటన చూసి ముగ్ధులయిన సర్వేపల్లి రాధాకృష్ణ గారు ప్రశంసల జల్లు కురిపించారు..