చాలామంది హీరోలు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాక తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అడుగు పెట్టారు, కొంతమంది హీరోలు కొంత ముందుగానే అడుగుపెట్టారు, జూనియర్ యెన్.టి.ఆర్. మాత్రం మరీ చిరు ప్రాయం లో, సరిగా మీసాలు కూడా రాని వయసులోనే సినీ రంగ ప్రవేశం చేసేసారు. పట్టుమని 18 ఏళ్ళు నిండకముందే, ఓటు హక్కు రాక ముందే రామోజీ రావు గారు నిర్మించిన “నిన్ను చూడాలని ” సినిమా ద్వారా హీరో గ పరిచయం అయ్యారు. ఆ సినిమా కొంత అసంతృప్తి కలిగించినా ” స్టూడెంట్ నెంబర్ 1 తో హిట్ కొట్టి హీరో గ తొడ కొట్టాడు. తన 17 ఏటనే హీరో గ నటించిన చిత్రం ” నిన్ను చూడాలని” చిత్రం లో నటించినందుకు యెన్.టి.ఆర్. అందుకున్న మొట్ట మొదటి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
అక్షరాలా నాలుగు లక్షలు, 2001 లో, 17 ఏళ్ళ చిరు ప్రాయంలో నాలుగు లక్షలు చాల పెద్ద మొత్తం కింద లెక్క, అంత డబ్బు ఏం చేయాలో తెలియని వయసు, పారితోషికం అందుకున్న జూనియర్ నేరుగా ఇంటికే వెళ్లిపోయారు, తన మొదటి సంపాదన తన తల్లి శాలిని గారి చేతిలో పెట్టారట మన జూనియర్, ఆ తరువాత రెండు ఏళ్ళ లోనే స్టూడెంట్ నెంబర్ 1, ఆది, సింహాద్రి సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగారు ఎన్టీయార్. ఇప్పుడు కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఎన్టీయార్ సినీ ప్రయాణం మాత్రం తెలుగు సినీ ఇండస్ట్రీ లో ఒక అద్భుతమే. వారసత్వం ప్రవేశం మాత్రమే కలిగిస్తుంది, సొంత దమ్ము ఆసాంతం దన్ను గ నిలుస్తుంది అని నిరూపించిన దమ్మున్న నటుడు ఎన్టీఆర్.