
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]సా[/qodef_dropcaps] హు, సై రా లాంటి భారీ బడ్జెట్ మూవీస్ తరువాత టాలీవుడ్ ఫాన్స్ ఎంతగానో వేచి చూస్తున్న చిత్రం #RRR . ముందుగా అనుకున్న తేదికి సినిమా థియేటర్స్ లోకి వస్తుందో రాదో అని ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో వాటన్నిటికీ చెక్ పెడుతూ జక్కన్న దూకుడు పెంచాడు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఓ ఫ్యాక్టరీ లో వేసిన సెట్ లో ఎడతెరుపు లేకుండా RRR సినిమా షూటింగ్ జరుపుతున్నాడు రాజమౌళి. తాజా సమాచారం ప్రకారం పగటి పూట రామ్ చరణ్ ఇంక రాత్రిళ్లు జూనియర్ ఎన్టీఆర్‌పై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలిసింది. క్షణం కూడా తీరక లేకుండా షూటింగ్ జెట్ స్పీడ్ తో నడుస్తుంది అని ఫిలిం నగర్ లో గట్టి టాక్ వినిపిస్తుంది. దీనిబట్టి చూస్తుంటే జక్కన్న ఎలాగైనా సినిమా ని అనుకున్న డేట్ రోజు ఎలాంటి ఆలస్యం లేకుండా రిలీస్ చేయాలన్న ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తుంది.