
ఇక అమ్మడు త్వరలోనే డిజిటల్ మాధ్యమంలో అడుగు పెట్టడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. తెలుగులో అల్లు అరవింద్ ప్రారంభించిన ‘ఆహా’ యాప్ ప్రసారం చేయనున్న ఓ స్పెషల్ టాక్ షోలో తమన్నా నటించనున్నట్లు తెలుస్తుంది. ఆహా యాప్ ను తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేయడానికి అల్లు అరవింద్ ప్రస్తుతం కొందరు దర్శకులు.. కంటెంట్ రైటర్ల తో సంప్రదింపులు జరుపుతున్నాడట. ఇక ఇప్పటికే స్టార్ హీరోయిన్ సమంత.. నిత్యామీనన్ లాంటి వాళ్లు వెబ్ సిరీస్ లోకి వస్తున్న నేపథ్యంలో తమన్నా ఆహా కోసం ఓకే చెప్పిందట. ఈ మధ్య వెబ్ సిరీస్ లో నటించడానికి హీరోయిన్లు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు.

