ఓటిటీ వచ్చిన తరువాత హీరోలు, హీరోయిన్లు, హీరోయిజం మరియు అభిమానుల సంఖ్యకు ఎటువంటి ప్రాముఖ్యత లేదని అంటుంది. నేను 7-8 సంవత్సరాల క్రితం స్టార్‌డమ్ సంపాదించినప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. దక్షిణాదిలో అభిమానుల శక్తి ఎక్కువగా ఉండేది వారు హీరోస్ ని తయారు చేసేవారు. కానీ ఓటిటీ వచ్చిన తరువాత దాని విలువ తగ్గిపోయింది అని తమన్నా చెబుతుంది.
థియేటర్స్ కంటే ఒటిటిలపై ఎక్కువ పోటీ ఉందని, ఎందుకంటే వీలైనంత ఎక్కువ కంటెంట్‌కు అక్కడ అవకాశం ఉందని ఆమె అన్నారు. ఓటిటిలో పనిచేసే నటీ నటులు డిమాండ్ ప్రకారం త్వరగా మారాలి మరియు వారి ప్రతిభను ప్రదర్శించే వివిధ విషయాలపై వారు ప్రయోగాలు చేయాలి, అప్పుడే వారు విజయవంతం అవుతారు అని ఆమె చెప్పారు. ముందు ముందు మొత్తం ఓటిటీ నే అని దీనితో హీరో, హీరోయిజం తగ్గిపోతుందని తమన్నా అంటుంది.