మిల్కీ బ్యూటీ తమన్నాపై రిలేషన్ మచ్చపడింది. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో కొంత కాలంగా రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు న్యూ ఇయర్ న్యూస్ నడిచింది.కొత్త సంవత్సరం గోవాలో జరిగిన ఓ పార్టీలో వీరిద్దరూ కిస్ చేసుకుంటు కనిపించారు. అప్పటి నుంచి రూమర్స్ రైయ్ మన్నాయ్.. కాగా తమన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించింది. ‘నేను, విజయ్ వర్మ కలిసి ఒక సినిమా చేశాం. అప్పటి నుంచి మాపై రూమర్లు వినిపిస్తున్నాయి.
కానీ ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అంతకు మించి నేనేమీ చెప్పను. మా సినిమాలకు సంబంధించిన రూమర్స్ కంటే మా రిలేషన్‌షిప్, పెళ్లిళ్లపైనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. నిజంగా నాకు పెళ్లి జరిగే సమయానికి, ప్రేక్షకులే చాలా పెళ్లిళ్లు చేసేలా ఉన్నారు. డాక్టర్, బిజినెస్‌మెన్ అంటూ ప్రతీ శుక్రవారం ఎవరో ఒకరితో నా పెళ్లి చేస్తున్నారు’ అంటూ సెటైరికల్‌గా మాట్లాడింది తమన్నా. ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!