
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ఎక్కువగా వినిపిస్తున్న మాట నెపోటిజమ్.. అంటే బంధుప్రీతి అన్నమాట. తన వాళ్లకే అవకాశాలు ఇచ్చుకుంటూ బయటి వాళ్లను తొక్కేసే ప్రక్రియను నెపోటిజమ్ అని ముద్దుగా పిలుస్తుంటారు. బాలీవుడ్‌లో ఇది ఎక్కువగా కనిపిస్తుందిప్పుడు. ఎంతో భవిష్యత్తు ఉన్న సుశాంత్ లాంటి స్టార్ హీరో చనిపోయిన తర్వాత అందరూ దీనిపై ఫోకస్ చేస్తున్నారు.తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ నెపోటిజంపై తన అభిప్రాయం వెల్లడించింది బంధుప్రీతి, రాజకీయాలు అంతటా ఉంటాయి. ఇది మన గెలుపు, ఓటములను నిర్ణయించలేదని నా భావన అని తమన్నా చెప్పుకొచ్చింది. నేను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే ముందు ఎలాంటి పరిచయాలు లేవు. కేవలం ఓ ముంబై అమ్మాయిని మాత్రమే. తెలుగు, తమిళ భాషలు రావు. అక్కడి వారెవరు నాకు తెలియదు. అయిన నా కష్టం, టాలెంట్ చూసి వరుస అవకాశాలు ఇచ్చారు. విజయాలకి, పరాజయాలకి విధిరాతే కారణం.

