
బాలకృష్ణ కథానాయకుడిగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘అఖండ 2: తాండవం’ చిత్ర విజయోత్సవ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తమన్ మాట్లాడుతూ.. “యూట్యూబ్, సోషల్ మీడియా తెరిస్తే చాలు, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మన తెలుగు పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. ఇంత మంది హీరోలు, ఈ స్థాయి అభిమానులు మరెక్కడా లేరు..
అలాంటిది మనలో మనం ఐక్యత లేకుండా ఉండటం బాధాకరం,” అని అన్నారు. తమ సినిమా విడుదల సమయంలో చివరి నిమిషంలో ఎదురైన అడ్డంకులను పరోక్షంగా ప్రస్తావిస్తూ..”సినిమాను ఆపాలనుకుంటే ముందే చేయొచ్చు. కానీ చివరి నిమిషంలో అడ్డుకోవడం వెనుక ఉద్దేశం స్పష్టమవుతోంది. ఇలాంటివి చూస్తుంటే మన మధ్య ఐక్యత లేదని అర్థమవుతోంది. కష్టాల్లో ఉన్న నిర్మాతకు అండగా నిలవాలి కానీ, బయట సలహాలు ఇవ్వడం సరికాదు,” అని పేర్కొన్నారు..!!

