అల్లు అర్జున్ నటించిన రాపిడో ప్రకటనపై విమర్శలు వస్తున్నాయి. ఆర్టీసీ బస్ అంటే సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటుందని.. ర్యాపిడో చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని, అదే సమయంలో మసాలా దోసెను సిద్ధం చేస్తుందని యాడ్ నిర్వహకులు చెప్పినట్టు అర్ధమవుతుంది. దీంతో ఆర్టీసీలో ఉద్యోగులు, అభిమానులు, విశ్రాంత ఉద్యోగులు, ఆర్టీసీ ప్రయాణికుల నుండి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణాలోని సామాన్య ప్రజలు ప్రయాణించే టీఎస్ ఆర్టీసీని కించపరచడం ఉద్యోగులు,
ప్రయాణికులు ప్రజలు ఎవ్వరు సహించరు. ప్రజా రవాణా సంస్థల్ని నటులు కించపరచొద్దు. ప్రజా రవాణాను ప్రోత్సహించే ప్రకటనల్లో నటులు నటిస్తూ ఆదర్శంగా ఉండాలి. టీఎస్ ఆర్టీసీ సామాన్యుల సేవలో ఉంది. అందుకే నటుడికి, ప్రకటనను ప్రచారం చేస్తున్న సంస్థకు లీగల్ నోటీసు ఇచ్చింది. బస్ స్టేషన్లలో స్టిక్కర్లు, కరపత్రాలు అంటించే వారిపై, బస్సుల్లో, బయట పాన్, గుట్కా ఉమ్మేసే వారిపైనా కేసులు నమోదు చేస్తున్నాం’ అని సజ్జనార్ తెలిపారు.