NTR, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన రెండో చిత్రం ‘టెంపర్’ .. ఆంధ్రావాలా ప్లాప్ తర్వాత ఈ కాంబినేషన్ నుంచి చాలా గ్యాప్ తరవాత వచ్చిన సినిమా ఇది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాలో మూర్తి పాత్ర చాలా కీలకం.. ముందుగా ఈ పాత్రను రాసుకుంటున్నప్పుడు విప్లవ కథనాయకుడు ఆర్ నారాయణమూర్తితో చేయించాలని అనుకున్నారు పూరి.. ఆయన్ని సంప్రదించారు కూడా.. కానీ నారాయణమూర్తి మాత్రం సున్నితంగా ఆ అపాత్రని తిరస్కరించారు. దీనిని వదులుకోవడం వెనుక ఉన్న కారణాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారాయన.
” ఈ సినిమాలో ఇంత మంచి వేషాన్ని రాసి, నాకు ఇవ్వడానికి వచ్చిన పూరికి ముందుగా సెల్యూట్ చేస్తున్నాను. నాతో ఒక డిఫరెంట్ వేషం వేయిద్దామని అనుకున్నారు.. ఎన్టీఆర్ కూడా చేయమని ప్రేమతో అడిగారు.. కానీ చేయను అని చెప్పేశాను. ఎందుకంటే ఇండస్ట్రీకి జూనియర్ ఆర్టిస్ట్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా ఎదిగాను.. హీరోగా మరో అయిదేళ్ళు చేస్తాను కావచ్చు.. అందుకే మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేయకూడదని అనుకున్నా.. అంతే తప్ప మరో ఉద్దేశం లేదు” అని ఆయన వెల్లడించారు. కాగా ఆయన వదులుకున్న ఆ పాత్రను పోసానితో చేయించారు పూరి.. సినిమాలో ఆ పాత్ర ఎంతగా పెలిందో అందరికి తెలిసిందే.