సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటో షూట్స్, రీల్స్, వీడియోస్‌తో సందడి చేస్తూ ఉంటారు. అటువంటి విష్ణు ప్రియ ఫేస్‌బుక్ అకౌంట్ స్టోరీలో మంగళవారం రాత్రి చాలా అంటే చాలా అసభ్యకరమైన ఫోటోలు పోస్ట్ అయ్యాయి. ఒంటి మీద నూలు పోగు లేకుండా ఉన్న మహిళల ఫోటోలను చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. ఫేస్‌బుక్ పేజీలో ఏవేవో వీడియోస్ పోస్ట్ అయ్యాయి. ఇదేమిటి? అని ఆరా తీస్తే..అసలు విషయం బయటపడింది. విష్ణు ప్రియ భీమినేని ఫేస్‌బుక్ అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేశారు. ఆమె ఇమేజ్ డ్యామేజ్ చేసే విధంగా నీలి చిత్రాలను పోస్ట్ చేశారు. విషయం తెలియడంతో విష్ణు ప్రియ జాగ్రత్త పడ్డారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోయర్లకు మెసేజ్ అందించారు. ”విష్ణు ప్రియ ఫేస్ బుక్ పేజీ హ్యాక్ అయ్యింది. దయచేసి ఈ సమాచారాన్ని అందరికీ చేరవేయండి. ఆ పేజిని అన్ ఫాలో అవ్వండి” అని ఇన్‌స్టాగ్రామ్ స్టొరీలో ఆవిడ పోస్ట్ చేశారు. అదీ సంగతి! విష్ణు ప్రియకు ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్ కంటే ఎక్కువ మంది ఫాలోయర్లు ఉన్నారు. సుమారు 11 లక్షల మంది ఆమెను ఫాలో అవుతున్నారు. అటు ఫేస్‌బుక్‌లో ఆమెకు నాలుగు మిలియన్స్ ఫాలోయర్లు ఉన్నారు. హ్యాక్ అవ్వడంతో ఫేస్‌బుక్ టీమ్‌కు విష్ణు ప్రియ కంప్లైంట్ చేశారు. మళ్ళీ ఆమె చేతికి అకౌంట్ రావడానికి కొంత టైమ్ పట్టవచ్చు..!!