in

telugu fans upset with deepika padukone entry in allu arjun film!

దీపిక పదుకొణె తాజాగా అట్లీ, అల్లు అర్జున్ కాంబోలో రూపొందుతున్న ఇంటర్నేషనల్ స్థాయిలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. ఈ సినిమా కోసం విడుదల చేసిన స్పెషల్ వీడియోలో ఆమెను ఒక సూపర్ ఉమెన్ పాత్రలో చూపించారు. అయితే సాధార‌ణంగా సినిమాల్లోకి హీరోయిన్ ఎంట్రీ అంటే హీరో నుంచి కనీసం ఓ పాజిటివ్ స్పందన వస్తుంది. కానీ ఈసారి అల్లు అర్జున్ మాత్రం పూర్తిగా మౌనంగా ఉన్నారు. దీపిక ఎంట్రీ వీడియోపై ఆయన ఇన్‌స్టాగ్రామ్, X లేదా ఇతర ప్లాట్‌ఫామ్‌లలో ఎక్కడా స్పందించలేదు.

ఇది చాలా మందిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది..తెలుగు ఫ్యాన్స్‌లో, ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు, సందీప్ రెడ్డి వంగా అభిమానులలో దీపికపై ఉన్న నెగెటివ్ వైబ్ కారణంగా ఆమెని టాలీవుడ్‌కి తీసుకురావడంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. “స్పిరిట్” సినిమాకు సంబంధించి గతంలో జరిగిన పరిణామాలే దీపిక మీద నెగెటివ్ ఫీల్‌కి కారణం. ఈ నేపథ్యంలో బన్నీ సైలెన్స్ చూసి ఇది ఓ వ్యూహమా? అనేది చర్చనీయాంశమైంది..!!

Samantha remove her Ye Maaya Chesave tattoo on her back ?