in

telugu beauty Krithi Shetty focused on Kollywood Offers!

గ్లామర్ విషయంలో వంకబెట్టవలసిన పనిలేదు. డాన్స్ విషయంలోను ఈ బ్యూటీ శభాష్ అనిపించుకుంది. ఇక ఈ ట్రెండ్ కి అవసరమైనంత యాక్టింగ్ ఉంది. కానీ దురదృష్టం కొద్దీ ఆమెను ఫ్లాపులు పలకరించడం ఎక్కువైపోయింది. అదే సమయంలో టాలీవుడ్ నుంచి ఆమెకి అవకాశాలు తగ్గడం మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఆమె తమిళ..మలయాళ సినిమాలపై శ్రద్ధ పెట్టింది.

మలయాళంలో టోవినో థామస్ తో ఆమె చేసిన ‘ARM’ .. ఈ ఏడాది అక్కడి బ్లాక్ బస్టర్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. 30 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, 100 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. దాంతో ఇప్పుడు మలయాళం నుంచి ఆమెకి అవకాశాలు ‘క్యూ’ కడుతున్నాయి. ఇదే సమయంలో ఆమె కోలీవుడ్ లోను బిజీ అవుతుండటం విశేషం. తమిళంలో కార్తీ .. జయం రవి .. ప్రదీప్ రంగనాథన్ జోడీగా ఆమె చేస్తోంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి..!!

Samantha hits back at trolls who body shamed her!

Genelia D’Souza suffering with a rare disease!