శ్రీముఖి ప్రధాన పాత్రలో నటించిన క్రేజీ అంకుల్స్ సినిమా విడుదలకు సిద్దం అయిన సమయంలో మహిళ సంఘాల వారు మీడియా ముందుకు వచ్చి సినిమాను ఆపేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. క్రేజీ అంకుల్స్ సినిమా భారత సమాజంను తప్పుదోవ పట్టించే విధంగా ఉందంటూ వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళలను చిన్న చూపు చూసే విధంగా ఆ సినిమాలో సన్నివేశాలు ఉన్నాయని.. ప్రతి ఒక్క సన్నివేశం కూడా అందులో చూపించిన తర్వాతే సినిమాను విడుదల చేయాలని.. తమకు అభ్యంతరం ఉన్న సన్నివేశాలను తొలగించాలన్నారు.
సమాజంలో ఇప్పటికే మహిళల పట్ల చిన్న చూపు ఉంది. ఇలాంటి సినిమాల వల్ల మరింతగా సమాజంలో మహిళలను చిన్నచూపు చూస్తున్నారు అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీముఖి పాత్ర మహిళలకు పూర్తి వ్యతిరేకంగా ఉంటుందనే అభిప్రాయం ను వారు వ్యక్తం చేశారు. అయితే చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం సినిమా చూసిన తర్వాత స్పందించాలన్నట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. వారు మాత్రం ఇప్పటి వరకు మీడియా ముందుకు రాలేదు. నేడు సినిమా విడుదల కాబోతుంది.