in

Teja sajja Clarifies about Mahesh Babu’s Lord Rama role!

ను-మాన్’ పాన్-ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన యువ కథానాయకుడు తేజ సజ్జా, ఇప్పుడు ‘మిరాయ్‌’ అనే మరో సూపర్‌హీరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ఓ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ట్రైలర్‌లో కనిపించిన రాముడి పాత్రను సూపర్ స్టార్ మహేశ్ బాబు పోషించారంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఈ రూమర్లపై హీరో తేజ సజ్జా స్వయంగా స్పందించి పూర్తి స్పష్టత ఇచ్చారు.

చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో తేజ మాట్లాడుతూ, ‘మిరాయ్‌’ చిత్రంలో మహేశ్ బాబు నటించారన్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని తేల్చి చెప్పారు. “ట్రైలర్‌లో రాముడి పాత్రధారి ఎవరనేది ఉద్దేశపూర్వకంగానే సస్పెన్స్‌గా ఉంచాం. ప్రేక్షకులకు థియేటర్లలో ఒక ప్రత్యేకమైన అనుభూతిని, సర్‌ప్రైజ్‌ను ఇవ్వాలన్నదే మా చిత్ర బృందం ఆలోచన,” అని ఆయన వివరించారు. రాముడి పాత్ర కోసం ఏఐ టెక్నాలజీని వాడారని వస్తున్న ప్రచారాన్ని కూడా ఆయన తోసిపుచ్చారు..!!

OG USA Box Office Creates History In Premiere Pre-Sales!