1984 లో రామోజీ రావు గారు నిర్మించిన మొదటి చిత్రం ” శ్రీ వారికీ ప్రేమలేఖ”. పొత్తూరి విజయలక్ష్మి గారు ” చతుర” మాస పత్రిక లో వ్రాసిన నవల ను జంధ్యాల గారి డైరెక్షన్ లో నరేష్ హీరో గ ” శ్రీ వారికీ ప్రేమలేఖ” చిత్రం నిర్మించారు, నరేష్ కెరీర్ కి మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రం. ఆ చిత్రం షూటింగ్ కోసం ఫ్లైట్ లో వస్తున్న, నరేష్ పక్క సీట్ లో ఒక భారీ కాయం వచ్చి కూర్చుంది, హలో నరేష్ బాగున్నావా అని పలుకరించారు, నరేష్ కూడా హలో సర్ అని పలుకరించాడు.
విచిత్రం ఏమిటంటే ఆ పలకరించిన వ్యక్తి ఎవరో నరేష్ కు తెలియదు, అతని ఫీలింగ్ గమనించిన ఆ పెద్ద మనిషి నా పేరు రామోజీ రావు అని పరిచయం చేసుకున్నారట. ఆయన నిర్మిస్తున్న చిత్రం లో నటిస్తూ అయన పరిచయం లేక పోవటం తో నరేష్ చాల ఇబ్బంది గ ఫీల్ అయి సారీ చెప్పారట.మొదటి నుంచి సినిమా అనుకోని దానికి బడ్జెట్ కేటాయించిన తరువాత, డైరెక్టర్ గారి రోజు వారి కార్యక్రమాల్లో ఇన్వొల్వె అయ్యేవారు కాదు రామోజీ రావు గారు.