ఇప్పటికే ధనుష్, దుల్కర్ సల్మాన్ లు తెలుగులో వరుస సినిమాలు చేస్తూ తెలుగు హీరోలుగా చలామణి అవుతున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో సూర్య కూడా చేరుతున్నాడు. ఒకప్పుడు తెలుగులో నేరుగా ఒక సినిమా చేయాలని అవకాశం కోసం ఎదురు చూసిన సూర్య ఇప్పుడు తెలుగులో బిజీగా మారుతున్నాడు. ‘తండేల్’ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న చందు మొండేటి సూర్య తో ఒక సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కనుంది..
రీసెంట్ గా లక్కీ భాస్కర్ మూవీతో హిట్ కొట్టిన వెంకీ అట్లూరి కూడా ఒక మూవీకి సిద్ధంగా ఉన్నాడు. ఈ మూవీలో సూర్య హీరోగా నటిస్తున్నాడు. ఈ మధ్య మంచు విష్ణు మోహన్ బాబు బయోపిక్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపి, తెరపై మోహన్ బాబు పాత్రని సూర్య చేయనున్నట్లు కూడా తెలిపాడు. ఇప్పటికి సూర్య చేతిలో మూడు తెలుగు సినిమాలున్నాయి. ఇవి హిట్ అయితే తెలుగులో సూర్య కెరియర్ స్పీడ్ అందుకోవటం గ్యారంటీ. సూర్య ప్రజంట్ తమిళంలో కార్తీక్ సుబ్బరాజ్ తో రెట్రో మూవీ చేస్తున్నాడు..!!